సాక్షి, గుంటూరు: చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. అధికారం కోసం దేనికైనా తెగిస్తారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహా ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో.. గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం. కానీ, దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవకాశవాది. అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం మరోసారి రుజువైంది.
చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ‘చంద్రబాబుగారూ.. శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా?. మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు. ఇందుకుగానూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?’..
.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని, ఆయనకు బుర్ర లేదని, చేసిన తప్పును ఒప్పుకుని తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలి అని అంబటి డిమాండ్ చేశారు.


