breaking news
CBI report
-
బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI
-
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్‌పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్టీఆర్ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్సీపీ టార్గెట్‌గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై దాడి చేశారు. చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది. అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్ విసిరారు. -
సీఎం.. డిప్యూటీ సీఎం.. గుట్టురట్టు
-
కేటుగాళ్లు లడ్డూలా దొరికేశారు..
-
‘చంద్రబాబూ.. వెంకన్న స్వామి నిన్ను క్షమిస్తాడా?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. అధికారం కోసం దేనికైనా తెగిస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల మహా ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో.. గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు. మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం. కానీ, దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అవకాశవాది. అధికారం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ‘చంద్రబాబుగారూ.. శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొచ్చా?. మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు. ఇందుకుగానూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?’.. .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని, ఆయనకు బుర్ర లేదని, చేసిన తప్పును ఒప్పుకుని తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలి అని అంబటి డిమాండ్ చేశారు. -
లడ్డూ కల్తీపై CBI కీలక రిపోర్ట్.. ప్లాన్ ప్రకారమే కుట్ర
-
ఎవడు చెప్పాడు జంతు కొవ్వు ఉందని.. బాబు సర్కార్ కు CBI చెంపచెళ్ళు..!
-
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
-
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో CBI రిపోర్ట్
-
కోల్ కతా డాక్టర్ కేసులో సీబీఐ సంచలన నిజాలు
-
బాణాసంచాలో విషపూరిత రసాయనాలు!
న్యూఢిల్లీ: బాణాసంచా తయారీలో విషపూరిత రసాయన పదార్ధాలు వాడడం చాలా ప్రమాదకరమని సీబీఐ నివేదిక వెల్లడించిందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. బాణాసంచా తయారీలో బేరియం వాడకం, బాణాసంచాపై జరిపే ముద్రణ(లేబిలింగ్)లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. హిందుస్తాన్ ఫైర్వర్క్స్, స్టాండర్డ్ ఫైర్వర్క్స్ సంస్థలు పెద్ద స్థాయిలో బేరియంను కొనుగోలు చేసినట్లు తెలిసిందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఉత్పత్తిదారులకు మరో అవకాశం ఇవ్వదలిచామని, సీబీఐ నివేదికను వారికి అందించాలని కోర్టు సూచించింది. మనదేశంలో ఎక్కడోఒకచోట ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటుందని, ఈ కారణంతో బాణాసంచాపై విచారణ నిలిపివేయలేమని, ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిశీలించాలని కోర్టు వ్యాఖ్యానించింది. -
తీవ్ర రూపం దాల్చిన రవి అభిమానుల ఆందోళన
కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి బెంగళూరు(బనశంకరి) : దివంగత ఐఏఎస్ అధికారి డీకే.రవి మృతికి సంబంధించి సీబీఐ నివేదిక బయటపెట్టడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిసూ ఆమె తల్లి గౌరమ్మ, రవి అభిమానులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం నగరంలోని కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడించారు. వివరాలు.. రవిది ఆత్మహత్య, లేక హత్య అనే విషయంపై తేల్చాలని డిమాండ్ చేస్తూ రవి తల్లి తల్లి గౌరమ్మ తండ్రి కరియప్పలు ఆనంద్‌రావ్ సర్కిల్లో అహోరాత్రి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రహోంశాఖమంత్రి పరమేశ్వర్, ఇంధన శాఖ మంత్రి డికే.శివకుమార్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని రవి మృతికేసును సీబీఐ కి అప్పగించామని, నివేదిక ను త్వరగా విడుదల చేయాలని మనవి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆమేరకు ఎలాంటి నివేదిక విడుదల కాలేదు. దీంతో కోపోద్రిక్తులైన రవి అభిమానులు ఆదివారం కేంద్రమంత్రులైన డీవీ.సదానందగౌడ, అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప ఇళ్లను ముట్టడించారు. సీబీఐ నివేదికను ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఆ దిశగా స్పందించడం లేదని గొడవకుదిగారు. తాము నడి వీధిలో కూర్చుని పోరాటం చేస్తుండగా సదానందగౌడ అభిమానులతో కలిసి పుట్టినరోజు నిర్వహించుకున్నారని, ఒక్కసారి కూడా రవి తల్లిని పరామర్శించడానికి రాలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంవడగా ధర్నాలో పాల్గొన్న డికే.రవి తండ్రి కరియప్ప అస్వస్థతకు గురవ్వడంతో ఎంఎస్.రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
ఆ ఐఏఎస్ అధికారిది ఆత్మహత్యే!
కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తూ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవి బాగా నష్టపోయారని సీబీఐ తన నివేదికలో తెలిపింది. చిక్‌బళ్లాపూర్ ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడబెట్టారని, అందులో తీవ్రంగా నష్టం రావడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది. అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ ఏడాది మార్చిలో ఐఏఎస్ అధికారి డీకే రవి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. రవి చిట్టచివరిసారిగా పనిచేసిన వాణిజ్య పన్నుల శాఖ నుంచి సర్వీసు ఫైళ్లు సేకరించిన సీబీఐ.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు తన తుది నివేదికను వెలువరించింది. -
కమల్ స్పాంజ్ కేసు పై వివరణ ఇవ్వండి
బొగ్గుకేసులో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్, పవర్ లిమిటెడ్ సంస్థపై కేసు ముగిసిందన్న సీబీఐ నివేదికపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం సునిశితమైన ప్రశ్నలు సంధించింది. కమల్ స్పాంజ్ సంస్థపైన, సంస్థ డెరైక్టర్లపై కేసుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ఇచ్చిన నివేదికపై వాదనల నేపథ్యంలో కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. ఆ సంస్థపై నమోదైన ఎఫ్ఐఆర్లోని ఏ అంశానికి ఆధారాలు దొరకలేదో వివరణ ఇవ్వాలని, ప్రాథమిక విచారణ దశనుంచి, ఎఫ్ఐఆర్ స్థాయివరకూ దర్యాప్తునకు అసలు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని అదనపు సెషన్స్ న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు. ప్రాథమిక విచారణలో రికార్డుచేసిన అంశాలపై మీరు సేకరించలేకపోయిన ఆధారాలేమిటి?, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక మినహా సమీకరించిన ఆధారాలేమిటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయినుంచి దర్యాప్తును సాగించేందుకు మీకున్న ప్రాతిపదిక ఏమిటి? ప్రాథమిక విచారణ దశలోనే ఎందుకు ఆగలేకపోయారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
‘బొగ్గు’ మార్గదర్శకాలను మా ముందుంచండి
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న బొగ్గు గనుల స్కాంలో సర్కారుకు మరో ఎదురుదెబ్బ. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ నివేదికపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గనుల కేటాయింపుపై ప్రశ్న ల వర్షం కురిపించింది. బొగ్గుగనుల కేటాయింపునకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ అనుసరించిన విధివిధానాలను తమ ముందుంచాలని న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని బుధవారం ఆదేశించింది. కేటాయింపులపై స్క్రీనింగ్ కమి టీ అనుసరించిన విధానాలు ఏమిటని ప్రశ్నించిన న్యాయమూర్తులు సదరు విధివిధానాలను దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల్లో పేర్కొన్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా బొగ్గు గనుల శాఖలోని స్క్రీనింగ్ కమిటీ జరిపిన ఈ కేటాయింపుల నిర్ణయం సహేతుకంగా జరిగిందో లేదో కూడా తాము పరిశీలిస్తామని అటార్నీ జనరల్ జీఈ వాహనవతికి తెలిపారు. కాగా, ఇప్పటి వరకు జరిగిన 41 కేటాయింపులు రద్దు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే.. స్క్రీనింగ్ కమిటీ 36వ భేటీలో తీసుకున్న నిర్ణయాల తాలూకు పూర్తి వివరాలు సమర్పించండి. కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయో లేదో మేం పరిశీలిస్తాం. దరఖాస్తులను ఏవిధంగా అనుమతించారో, ఏవిధంగా తిప్పికొట్టారో కూడా దృష్టి సారిస్తాం. కేటాంపులో కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) సిఫార్సులు ఆశ్చర్యకరం. స్క్రీనింగ్ కమిటీ వాటిని ఆమోదించి ఉండాల్సింది కాదు. మొత్తం 28 దరఖాస్తులను సీఈఏ సిఫార్సు చేస్తే 20 ఎలా ఆమోదించారు? మరో 11 కంపెనీల దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ ఏవిధంగా జోడించింది? వీటిని కూడా సీఈఏ సిఫార్సు చేసిందా?


