సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు.. దావోస్ వెళ్లి అబద్దాలు చెప్పారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలతో తండ్రి, కొడుకులు బతుకుతున్నారంటూ దుయ్యబట్టారు. కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూముల కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో గ్రీన్కో కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడితో ఉద్యోగి మరణించాడు. అదే నిజమైతే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ దేనికోసం?. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఎందుకు రాజీపడుతున్నారు. కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ కావాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని కురసాల కన్నబాబు హెచ్చరించారు.


