జోగి సోదరులను తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేశారు: కేతిరెడ్డి | Kethireddy Venkatarami Reddy Meets With Jogi Ramesh And Slams Chandrababu Government Over Illegal Arrests, More Details | Sakshi
Sakshi News home page

జోగి సోదరులను తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేశారు: కేతిరెడ్డి

Jan 27 2026 1:49 PM | Updated on Jan 27 2026 3:33 PM

Kethireddy Venkatarami Reddy Meets With Jogi Ramesh

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జోగి రమేష్‌, జోగి రామును తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని.. చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

‘‘జోగి రమేష్‌ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యుల పైనా కేసు పెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మర్డర్లు చేసిన వారిపై కేసులు పెట్టడం లేదు. కోడిని, గొర్రెలను కోసిన వారి పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మావాళ్లు పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పిదాల పై జోగి రమేష్ పోరాటం చేస్తూనే ఉంటారు.

చంద్రబాబుకు కేతిరెడ్డి సవాల్‌..
‘‘ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోంది. కల్తీ మద్యం తయారు చేసేది నీ జిల్లా నుంచే చంద్రబాబు. బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నావ్. కానీ ఇప్పుడు ఊరికి నాలుగు బెల్టు షాపులు ఉన్నాయి. వేలంపాటలో బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. గిట్టుబాటు కావడం కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తన పై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. కేసు పెట్టిన వాసుదేవ రెడ్డి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదే వాసుదేవ రెడ్డి మరో కేసులో అప్రూవర్ అవుతాడు. ఇది కేసును ప్రభావితం చేయడం కాదా?. చంద్రబాబుపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎలా తొలగిస్తున్నారు?

..కేసులు పెట్టిన మీరే ఆ కేసులు తీసేయాలని కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్‌లో లోకేష్ చెప్పాడు. లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్‌గా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముంది?. మీరు ఎంతమందిని జైల్లో వేస్తారో.. అంతకు పదింతలు ప్రశ్నిస్తాం. కేసులు.. అరెస్టులు.. జైళ్లు మాకు కొత్త కాదు...ఇలాంటివి మేం చాలా చూశాం. తప్పుడు కేసులు కట్టే అధికారులు ఆలోచన చేయండి. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సన్నిహితులుగా ఉన్నారు.. ఫోటోలు ఉన్నాయని కేసులు పెట్టడం కాదు. అత్యాచారాలు చేసిన వారు లోకేష్‌తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లోకేష్‌ను కూడా ముద్దాయిగా చేరుస్తారా?. చట్టం అందరికీ ఒకటే

జోగి రమేష్ కు కేతిరెడ్డి పరామర్శ.. కూటమికి  దిమ్మతిరిగే వార్నింగ్

..కేసులు తీయించుకోవాలని చూస్తున్న ప్రయత్నంపై అప్పీల్‌కు వెళతాం. నాయకులు చెప్పారని అధికారులు అక్రమ కేసులు పెడితే ఇబ్బంది పడతారు. మీకు చేతనైతే నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో అరికట్టండి. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిపారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. ఈ రోజు లడ్డూలో అలాంటిదేమీ లేదని తేలింది. తాము ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిందని కూటమి నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూమతాన్ని కాపాడతాడా?. నకిలీ మద్యం విషయంలో తప్పుడు ఆధారాలతో బురదజల్లారు. దీని పై లీగల్ గా ఫైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదలం

..మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ మేం అధికారంలో ఉన్నప్పుడే తెచ్చాం. మంచి మద్యం ఇస్తానని చంద్రబాబు చెబితే అందరూ ఈలలు వేశారు. మంచి విద్య, వైద్యం ఇస్తామని జగన్ చెబితే ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మా ధర్మవరంలో ఇవాళ తనిఖీ చేసినా 70 శాతం నకిలీ మద్యం దొరుకుతుంది. జనం దగ్గరకు వెళ్లాంటే గట్స్ ఉండాలి. నేను ఇది చేశానని చెప్పి గడప గడపకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేలందరినీ ప్రజల ఇళ్లకే పంపించారు. వాళ్లచేతిలోనే కదా ప్రభుత్వం ఉంది. నా పై ఆరోపణలకు ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు. ఈ ప్రభుత్వంలోని నేతలకు దమ్ముంటే గడపగడపకు వెళ్లమని చెప్పండి. నేను ఎక్కడ భూ కబ్జాలు చేశానో చూపించమనండి. చేతనైతే వాటిపై చర్యలు తీసుకోమనండి’’ అంటూ కేతిరెడ్డి సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement