అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది | YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది

Feb 2 2026 3:46 AM | Updated on Feb 2 2026 1:00 PM

YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu
  • చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 
  • అంబటి రాంబాబు, జోగి రమేష్‌ఇళ్లకు నిప్పు జంగిల్‌రాజ్‌కు ప్రతీక 
  • ఆటవిక పాలన అంతం కాక తప్పదు

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి శనివారం రాత్రి.. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటికి ఆదివారం టీడీపీ గూండాలు, అసాంఘిక శక్తులు నిప్పు పెట్టడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు పెట్టిన నిప్పు జంగిల్‌రాజ్‌కు ప్రతీక అన్నారు. ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. మీ సర్కార్‌ను దహించి వేయక మానదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. 

ఈ మేరకు ఆదివారం  వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నిర్ధారణ చేసిన తర్వాత, మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశి్నస్తే, జీరి్ణంచుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో  భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారూ అది మీ భ్రమే. 

ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్‌రాజ్‌కు ప్రతీక. ఈ నిప్పు మీ సర్కార్‌ను దహించి వేయక మానదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయక మానదనీ గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలను రేపే చేయీ కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగిల్‌ రాజ్‌ భూ స్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement