ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్‌ అంటారా?.. కేటీఆర్ | KTR demands that Revanth Reddy apologize to students | Sakshi
Sakshi News home page

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్‌ అంటారా?.. కేటీఆర్

Aug 2 2026 5:26 PM | Updated on Aug 2 2026 5:43 PM

KTR demands that Revanth Reddy apologize to students

సాక్షి, హైదరాబాద్‌: ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం రేవంత్‌ రెడ్డి అవమానించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. ఈ విషయమై రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, ఇంజినీర్లను "క్రిమినల్ వేస్ట్" అనడం ఏంటని  దేశ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఇంజినీర్లను అవమానించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి చేత క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీదేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. "ఒకవేళ రాహుల్ మౌనం వహించడం అంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్థించినట్లే విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు  చేశారు. తెలంగాణ యువత కాంగ్రెస్ హామీల మోసాన్ని గుర్తుంచుకుంటుంది రేవంత్ వెంటనే విద్యార్థులు, గురువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి" అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement