హైదరాబాద్‌లో కారు నడిపి బీభత్సం సృష్టించిన మైనర్‌ బాలుడు | Driver Causes Havoc in Hyderabads Borabanda | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కారు నడిపి బీభత్సం సృష్టించిన మైనర్‌ బాలుడు

Aug 2 2026 3:57 PM | Updated on Aug 2 2026 4:26 PM

 Driver Causes Havoc in Hyderabads Borabanda

హైదరాబాద్‌: బోరబండలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ కారును మైనర్‌ బాలుడు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతడి పేరును అలీ అహ్మద్‌(17)గా గుర్తించారు. అతడు కారుతో సృష్టించిన బీభత్సానికి ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు గాయాలయ్యాయి. 

వారి పేర్లు రాజ్‌కుమార్‌ (60), ప్రభాకర్‌ (55). ఓ ఇంటిముందే ఈ ప్రమాదం జరిగింది. మైనర్‌ బాలుడు కారుపై అదుపుకోల్పోవడం, అతడికి డ్రైవింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వేగంగా ఇంటి గేటును ఢీకొట్టే దిశగా వెళ్లింది. త్రుటిలో ఆ ఇంటి ముందు ఆగిపోయింది. లేదంటే ఇంటి ముందు గోడ కూడా ధ్వంసమయ్యేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement