breaking news
Jebel Ali Metro station
-
దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ!
జెబెల్ అలీ: దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీలో బుధవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి.స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో ఒక భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దుబాయ్ నగర కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి, సమీపంలోని అల్ ఫుర్జాన్ నివాస ప్రాంతం నుంచి కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోల్లో నివాస ప్రాంతాలు, తాటి చెట్ల మధ్య నల్లటి పొగ కమ్ముకోవడం కనిపిస్తోంది. Iran / USA / EmirateIn den Emiraten/Dubai ist das Hafengebiet, Jabal Ali in die Luft geflogen.🧐Es kam innerhalb von 20 Minuten zu etwa 9 schweren Explosionen!Vor der Küste ist außerdem ein Gasfeld explodiert und in der Straße von Hormuz brennt ein Tanker. pic.twitter.com/mjnXfuzDxF— Hai Stein (@Stein3Hai) August 5, 2026ఈ పొగ పారిశ్రామిక ప్రమాదం వల్ల వచ్చిందా లేక మరేదైనా కారణమా అనే దానిపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో జెబెల్ అలీని లక్ష్యంగా చేసుకున్నట్లు కొందరు సోషల్ మీడియా ఖాతాల్లో ఆరోపించినప్పటికీ, దీనికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో కూడా ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు దుబాయ్ మీడియా కార్యాలయం వెంటనే స్పందించి ఖండించింది. ప్రస్తుతం తాజా ఘటనపై అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.ఇది కూడా చదవండి: ‘జపాన్ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక! -
మహిళను తాకినందుకు మూడు నెలల జైలు
దుబాయ్: మెట్రో స్టేషన్ లో మహిళను తాకినందుకు ఓ భారతీయుడికి దుబాయ్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత అతడు దుబాయ్ విడిచి వెళ్లిపోవాల్సివుంటుంది. నిందితుడి పేరును జేకే(26) మాత్రమే వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో 40 ఏళ్ల భారత మహిళను బహిరంగంగా తాకాడన్నది అతడిపై నేరారోపణ అని గల్ఫ్ న్యూస్ తెలిపింది. మొదటి తప్పుగా భావించి కోర్టు అతడికి స్వల్ప శిక్ష విధించిందని పేర్కొంది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా మహిళను తాకలేదని కోర్టుకు జేకే తెలిపాడు. ఎస్కలేటర్ పై ఉండగా అదుపుతప్పి ఆమెపై పడ్డాడని చెప్పాడు. ఆమెను తాకాలన్న ఉద్దేశం తనకు ఏకోశానా లేదన్నాడు. జెబెల్ అలీ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతడు కావాలనే తనను తాకాడని, తాను ప్రశ్నించేసరికి బాలెన్స్ తప్పి పడిపోయినట్టు సాకు చెప్పాడని సదరు మహిళ ఆరోపించింది.


