డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

డ్రగ్

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

దొడ్డబళ్లాపురం: కాలేజీ విద్యార్థినులకు డ్రగ్స్‌ ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక గ్యాంగ్‌ రేప్‌ చేసి వీడియోలు, ఫోటోలు తీసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న కేసులో పోలీసులు మొత్తం ఐదుమందిని అరెస్టు చేశారు. ఇప్పటికే డిక్సన్‌ శాంట్రా (21), నిఖిల్‌ (34)లను అరెస్టు చేసిన పోలీసులు వీరికి సహకరించిన శ్రవన్‌ (21), అనిరుద్ధ్‌ (33), మోహిత్‌ జైన్‌ (23)లను నిర్బంధించారు. తమిళనాడుకు చెందిన బాధిత యువతి బెంగళూరులోని ప్రముఖ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఈమెను ఇన్‌స్టా ద్వారా పశ్చిమ బెంగాల్‌కు చెందిన డిక్సన్‌ పరిచయం చేసుకున్నాడు. ఇతడు కూడా బెంగళూరులోనే ఉంటాడు, ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను జక్కూరులోని ఒక విల్లాకు తీసికెళ్లాడు. అక్కడ యువతికి డిక్సన్‌, నిఖిల్‌ బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చి అత్యాచారం చేసి వీడియోలు తీసుకున్నారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు అమృతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

పోయిన బంగారం దొరికింది

మండ్య: కేఎస్‌ ఆర్టీసీలో ప్రయాణిస్తూ ఓ మహిళ బంగారు గొలుసు ఉన్న బ్యాగును మరిచిపోగా, పోలీసు సాయంతో తిరిగి దక్కింది. బెంగళూరు నివాసి లత తల్లితో కలిసి మైసూరు నుండి శ్రీరంగపట్నానికి వచ్చింది, అయితే 40 గ్రాముల బంగారు గొలుసు ఉన్న బ్యాగును మర్చిపోయి బస్సు దిగింది. తరువాత, తెలుసుకుని బస్టాప్‌లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ గౌడకు తెలిపింది. ఆయన టికెట్‌ నంబరును బట్టి బస్సును గుర్తించి బైక్‌లో వెంటాడారు. పాండవపుర మార్గంలో వెళుతుండగా, అడ్డుకుని బస్సులో ఉన్న బ్యాగును తీసుకుని మహిళకు అప్పగించారు. లక్ష్మణ్‌గౌడని ఆమెతో పాటు ప్రయాణికులు అభినందించారు.

మారథాన్‌లో విషాదం..

కిందపడి ఎస్‌ఐ మృతి

యశవంతపుర: ఆదివారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పోలీసు శాఖ నిర్వహించిన డ్రగ్స్‌ వ్యతిరేక మారథాన్‌లో ఉడుపి నగరంలో విషాదం సంభవించింది. కుందాపుర గ్రామాంతర స్టేషన్‌ ఎస్‌ఐ నాసిర్‌ హుసేన్‌ (58) మారథాన్‌లో పరుగు తీస్తుండగా గుండెపోటు వచ్చి, కిందపడిపోయారు, క్షణాల్లోనే కన్నుమూశారు. తాలూకా పంచాయతి కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆయనను అంబులెన్సులో దగ్గరిలోని ఆస్పత్రికి తరలించగా, చనిపోయాడని వైద్యులు తెలిపారు. చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఆయనకు 2010లో ఎస్‌ఐగా ఉద్యోగం వచ్చింది. భార్య ఇద్దరు పిల్లలున్నారు.

రేపు నృసింహాలయం మూత

కదిరి: చంద్రగహణం కారణంగా ఈ నెల 3వ తేదీన మంగళవారంఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం మినహా భక్తులకు ఆ రోజు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం అన్నదాన సత్రంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. స్వామివారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ తేదీన రాత్రి 9 గంటలకు తిరువీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారని తెలియజేశారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పారు. చంద్రగ్రహణం కారణంగా 3వ తేదీ బదులు 4వ తేదీన కదిరి పున్నమి పండుగ జరుపుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు సూచించారు.

ప్రియుని చేతిలో వివాహిత హత్య

చిక్కబళ్లాపురం ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో అక్రమ సంభందం పెట్టుకొన్న సందీప్‌ అనే దుండగుడు తేజస్విని (32) అనే మహిళను పొడిచి చంపాడు. ఇది చిక్కబళ్లాపురం నగరంలో జరిగింది. వివరాలు.. భర్తతో విడిపోయిన తేజస్విని ఓ హోటల్‌లో పని చేస్తూ అందులోనే ఓ గదిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సందీప్‌ (26) అనే యువకుడు ఆమెకు పరిచయమై వేరే ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. తేజస్విని తన స్నేహితురాలు అరుణను ఇంటికి తీసుకొచ్చింది. ఇది నచ్చని సందీప్‌ తాగి గలాటా చేశాడు. అదే మత్తులో కత్తితో తేజస్వినిపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక తేజస్విని చనిపోయింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి దూరమై ఆమె పిల్లలు అనాథలయ్యారు.

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు..  మరో ముగ్గురు అరెస్టు 1
1/3

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు..  మరో ముగ్గురు అరెస్టు 2
2/3

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు..  మరో ముగ్గురు అరెస్టు 3
3/3

డ్రగ్స్‌, గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement