పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం | - | Sakshi
Sakshi News home page

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

పరుగు

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం

చిక్కమగళూరులో పరుగు పోటీలో బాలికల ఉత్సాహం

మైసూరు నగరంలో..

శివాజీనగర: రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం, ఇందుకోసం బెంగళూరుతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పరుగు పోటీలు, వాకథాన్‌ను నిర్వహించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ తెలిపారు. ఆదివారం బెంగళూరు విధానసౌధ వద్ద పరుగు పోటీ, వాకథాన్‌ను ఆయన ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో వాకథాన్‌ జరుపుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ దందాను సవాల్‌గా తీసుకుని దానిని అంతం చేసే ప్రయత్నం జరుగుతోంది, ఏదో ఒకరోజు ఆ లక్ష్యాన్ని చేరుకొంటామన్నారు. 10 కి.మీ., 5.కి.మీ. పరుగు పోటీలో పాల్గొని విజేతలైనవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.సలీం సహా ఐపీఎస్‌లు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఇదే తరహాలో వాకథాన్‌, పరుగు పోటీలు జరిగాయి. యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పరుగు, నడక పోటీలు

వ్యసనాలకు దూరంగా ఉందాం

మండ్య: క్షణిక ఆనందం కోసం యువత తమ సంతోషకరమైన జీవితాలను కోల్పోవద్దని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కుమార్‌, ఎస్పీ శోభ సూచించారు. నగరంలోని సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య స్టేడియంలో పరుగు, నడక పోటీలు జరిగాయి. మనస్సు వ్యసనం నుంచి విముక్తి పొందితేనే ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. శారీరకంగా బలంగా ఉంటేనే మానసికంగా బలంగా ఉండగలమని పేర్కొన్నారు.

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం1
1/3

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం2
2/3

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం3
3/3

పరుగు పరుగున.. డ్రగ్స్‌ను తరిమేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement