కేంద్రం..కాక్రోచ్‌ జనతా పార్టీ మధ్య చర్చలు | Delhi Police Alert for CJP Parliament march Updates | Sakshi
Sakshi News home page

కేంద్రం..కాక్రోచ్‌ జనతా పార్టీ మధ్య చర్చలు

Jul 20 2026 8:07 AM | Updated on Jul 20 2026 8:10 PM

Delhi Police Alert for CJP Parliament march Updates

కేంద్రం సీజేపీల మధ్య చర్చలు  

  • కాక్రోచ్‌ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు  
  • నడ్డాకు విజ్ఞాపన పత్రాన్ని అందించింన సీజేపీ 
  • జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్‌ దాస్, అశుతోష్ రంకా భేటీ 
  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని భేటీలో స్పష్టత
  • లేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి  తేల్చి చెప్పిన కాక్రోచ్ పార్టీ 
  • సీజేపీకి కేంద్రానికి మధ్య కొనసాగుతున్న చర్చలు

ప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్‌ చర్చలు 

  • డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్‌ 
  • ప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్‌ చర్చలు 
  • అయితే,ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్నట్లు రాని అధికారిక ప్రకటన  
  • కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు పిలిచారు 
  • చర్చలకు తాను, మరో అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చలు జరుపుతామని సౌరవ్ దాస్ వెల్లడి 

సీజేపీ ఛలో పార్లమెంట్‌ మార్చ్‌లో ఎంపీ డింపుల్‌ యాదవ్‌ 

  • సీజేపీ ఛలో పార్లమెంట్‌ మార్చ్‌లో ఎస్పీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ 
  • డింపుల్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారంటున్న ఎస్పీ నేతలు 
  • డింపుల్‌తో పాటు పలువురుని నిర్భందించారని ఆరోపణలు 

ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత 

  • పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీ కార్యకర్తలు 
  • పార్లమెంట్‌కు వెళ్లే మార్గాలలో సీజేపీ కార్యకర్తల భైటాయింపు 
  • కార్యకర్తలపై పోలీసుల టియర్‌ గ్యాస్‌ ప్రయోగం 
  • పలువురు ఆందోళన కారులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు 

పోలీసుల అదుపులో దీప్కే

  • పోలీసుల అదుపులో కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
  • దీప్కే దీక్షను విరమింపచేసిన పోలీసులు
  • అనంతరం పోలీసుల అదుపులో దీక్కే 
CJP చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

  • పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
  • ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ,రాజ్య సభ రేపటికి వాయిదా  

సీజేపీ ఆందోళనలో పాల్గొంటా 

  • పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ 
  • సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న సోనమ్‌ 
  • ఆస్పత్రి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సప్ధర్‌గంజ్‌ ఆస్పత్రి సూపరిటెండెంట్‌లేఖ

పార్లమెంట్‌ వద్ద హై అలర్ట్‌

  • పార్లమెంట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • పార్లమెంట్‌ గేట్లను మూసివేసిన సీఐఎస్‌ఎఫ్‌
  • పెద్ద ఎత్తున పార్లమెంట్‌ వైపు దూసుకొస్తున్న కాక్రోచ్‌ కార్యకర్తలు. 
  • ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు. 

టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. 

  • బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. 
  • కాక్రోచ్‌ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. 
  • నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు.. 
  • పార్లమెంట్‌ లోపల సెక్యూరిటీ అలర్ట్‌.. 

 

పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీ

  • సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించారు. 
  • పార్లమెంట్‌ వద్ద హైటెన్షన్‌ చోటుచేసుకుంది. 
  • పార్లమెంట్‌ ప్రధాన గేటు వద్దకు భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు. 
  • కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. 
  • నిరసనకారులను చెడగొడుతున్న పోలీసులు. 
  • మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ
  • పార్లమెంట్‌ గేట్లను మూసివేసిన పోలీసులు. 
  • ఆందోళకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం

 

 

పార్లమెంట్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్తత..

  • పార్లమెంట్‌ ప్రధాన గేటుకు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు.
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌
  • పోలీసులు, సీజేపీ కార్యకర్త మధ్య తోపులాట.
  • ఆందోళకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.
  • సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

 

సీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డా

  • జేపీ నడ్డాతో చర్చలు ఉంటాయన్న సీజేపీ
  • సీజేపీ వ్యాఖ్యలను ఖండించిన నడ్డా.
  • సీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవన్న నడ్డా
  • సీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డా

 

  • పార్లమెంట్‌ ముట్టడికి కాక్రోచ్‌ పార్టీ విఫలయత్నం.
  • ప్రెస్‌క్లబ్‌ దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. 

 

పార్లమెంట్‌ వద్ద పనిచేయని ఫోన్స్‌..

  • పార్లమెంట్‌ పరిసరాల్లో పనిచేయని మొబైల్‌ ఫోన్స్‌.
  • సీజేపీ పార్లమెంట్‌ మార్చ్‌ పిలుపుతో మొబైల్‌ నెట్‌వర్క్‌పై నిషేధం.
  • సెంట్రల్‌ ఢిల్లీలో మొబైల్‌ నెట్‌వర్క్‌పై నిషేధం.
  • పార్లమెంట్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.
  • పార్లమెంట్‌కు వచ్చేందుకు ఎంపీల అవస్థలు.
  • ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయిన వాహనాలు. 
     

కేంద్రంపై విద్యార్థుల ఆగ్రహం.. 

  • జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన యువత
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు
  • విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్
  • నీట్ పేపర్ లీక్ సహా అనేక పోటీ పరీక్షల లీక్‌పై విద్యార్థుల ఆగ్రహం
  • కేంద్ర ప్రభుత్వం స్పందించాలని నినాదాలు
  • నీట్‌ అక్రమాలకు నిరసనగా చల్‌ పార్లమెంట్‌ మార్చ్‌.. 

జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత..

  • జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత..

  • సీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. 

  • సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌. 

  • సీజేపీ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు.

  • పోలీసులతో సీజేపీ కార్యకర్తల వాగ్వాదం

ఢిల్లీ:

  • జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేత
  • కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ నేపథ్యంలో నెట్‌వర్క్ నిలిపివేత
  • పనిచేయని ఫోన్ ఇంటర్నెట్ డేటా
  • మెట్రో స్టేషన్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా
  • ఐదు మెట్రో స్టేషన్లు మూసివేత

 

 

పోలీసుల తనిఖీలు..

  • సీజేపీ మార్చ్‌ నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌
  • ఢిల్లీకి వచ్చే అన్ని దారుల్లో తనిఖీలు.
  • ఢిల్లీ-గురుగ్రామ్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.

 

 

 

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున కాక్రోచ్‌ జనతా పార్టీ(CJP) తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

కాగా.. సీజేపీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 5 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచారు.

15 భద్రతా జోన్లుగా ఢిల్లీ విభజన.. 
భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతాన్ని 15 సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌కు సీనియర్ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌లు నిరసనకారుల రాకపోకలపై గంట గంటకు సమాచారం అందిస్తున్నాయి. సోమవారం ఉదయం 4 గంటల నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

 

పలు కీలక ప్రాంతాల్లో ఆంక్షలు
విజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర హై సెక్యూరిటీ ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించారు.

వాటర్ క్యానన్లు, బారికేడ్లు సిద్ధం
నిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వాటర్ క్యానన్లు, వజ్రా యాంటీ రయట్ వాహనాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. మెట్రో స్టేషన్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అవసరమైతే కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీప ఆసుపత్రులను కూడా అత్యవసర పరిస్థితుల కోసం అప్రమత్తం చేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. బారికేడ్లు, సీసీటీవీ నిఘా, యాంటీ సబోటేజ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతున్నాయి.


అభిజీత్‌ కీలక వ్యాఖ్యలు.. 
‘చలో సంసద్’ మార్చ్‌కు దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా నిలిచే స్థాయిలో ప్రజలు తరలివస్తున్నారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత 10–12 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి తిరిగి వచ్చిందని అన్నారు. “దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది రోడ్లపైకి ఎవరూ రారని, ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌గానే మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు జంతర్ మంతర్‌కు వచ్చే నాలుగు ప్రధాన రహదారులను చూడండి.. అవన్నీ పూర్తిగా నిండిపోయాయి” అని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు వెళ్లే తమ మార్చ్‌ను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలో పాల్గొంటారని, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement