సాక్షి, ఢిల్లీ: భారీ ఉగ్రకుట్రను దేశ రాజధాని పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు ఐసిస్(ISIS) ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఒకరు, సౌత్ ఢిల్లీలో మరొకరికి అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఇద్దరూ దేశ రాజధానిలో ఆత్మాహుతి దాడులకు కుట్రలు పన్నారని వెల్లడించారు.
ఢిల్లీ-భోపాల్ పోలీసులు సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బోఫాల్‌కు చెందిన అద్నాన్‌తో పాటు దక్షిణ ఢిల్లీకి చెందిన మరొక వ్యక్తిని ఐఈడీ బాంబులను తయారు చేస్తుండగా పట్టుకున్నారు. వీళ్లిద్దరి నుంచి పేలుడు పదార్థాలకు చెందిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో జనసంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతంలోనే వీళ్లు పేలుడుకు ప్రణాళిక రచించినట్లు తెలిందన్నారు.


