సాక్షి, న్యూఢిల్లీ: భారీ పేలుడుతో ఎర్రకోట వద్ద భయానక వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడు ధాటికి 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.


పేలుడు శబ్దం ఎంత బిగ్గరగా ఉందంటే సమీపంలోని దుకాణాల కిటికీలు, తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. పలు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలు కావడం పేలుడు తీవ్రతకు అద్దం పడుతోంది. గాయపడిన వాళ్లకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


#WATCH | Delhi: Car parts seen strewn around due to the force of the blast
Multiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No 1 of Red Fort Metro Station. Several people have been injured in the incident, sources tell ANI pic.twitter.com/UA8KDHqDTN— ANI (@ANI) November 10, 2025
పార్కింగ్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించిందని.. ఆ తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘‘ఏం జరిగిందో అర్థం కాలేదు. గాయపడ్డ వాళ్లను వంద అడుగుల దూరం లాక్కొచ్చాం’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెబుతున్నారు.

#WATCH | Delhi: Senior police officials at the spot following a blast near Gate No. 1 of Red Fort Metro Station
Multiple casualties have been brought to the LNJP hospital due to the blast near Gate No. 1 of Red Fort Metro Station. Several people have been injured in the… pic.twitter.com/FPpfsQfl70— ANI (@ANI) November 10, 2025
‘‘నా జీవితంలో ఇంత పెద్ద శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. పేలుడు ధాటికి నేను మూడుసార్లు కింద పడ్డాను. మేమంతా చనిపోబోతున్నట్లు అనిపించింది’’ అని ఓ దుకాణదారుడు చెప్పారు.

VIDEO | Blast near Delhi's Red Fort: Zeeshan, auto driver who got injured due to the blast, says: "The car in front of me was about two feet away. I don’t know whether there was a bomb in it or something else, but it exploded. It was a Swift Dzire car."
(Full video available on… pic.twitter.com/YoA4KJVqt4— Press Trust of India (@PTI_News) November 10, 2025


