శ్రద్ధా వాకర్‌ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్‌

Shraddha Walker Murder case: Delhi Police files 3000-page chargesheet - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్‌ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్‌ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్‌పూర్‌ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్‌ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top