దేశ రాజధాని నగరంలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలో, అజ్మేరీ గేట్ సమీపంలోని ఎస్.ఎన్. మార్గ్‌లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్ పరిహార్, లుమాకాంత్ పాండే, ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు.
పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్ క్యాన్లు, కండోమ్‌లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్ అని సమాచారం.
నగ్నంగా వచ్చెయ్.. నచ్చిన వారితో ఎంజాయ్
ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతోంది.
దేశరాజధానిలో విచ్చలవిడిగా...
గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్ రాకెట్‌లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్ ప్రాంతంలో నకిలీ డేటింగ్ యాప్ ప్రొఫైల్‌ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు ఆన్ లైన్ దోపిడీ (సెక్స్‌టార్షన్) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్‌ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్ రాకెట్‌లు బయటపడుతున్నాయి.
గత ఏడాది మార్చి లో పహర్‌గంజ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే మార్చి నెలలో గ్రాండ్ ప్లాజాలోని బ్లిస్ వెల్నెస్ స్పాపై జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్‌పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.
ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది.


