250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. | Gangster Kala Jathedi Gets Married Anuradha Choudhary In Delhi | Sakshi
Sakshi News home page

250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్‌స్టర్ల పెళ్లి..

Mar 12 2024 4:10 PM | Updated on Mar 12 2024 5:13 PM

Gangster Kala Jathedi Gets Married Anuradha Choudhary In Delhi - Sakshi

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, మహిళా క్రిమినల్‌ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'ల వివాహం మంగళవారం ఢిల్లీఓ జరిగింది. ద్వారకా సెక్టార్‌-3లోని సంతోష్‌ గార్డెన్‌, బాంక్వెట్‌ హాల్‌ వీరి పెళ్లి వేదికగా మారింది.. సందీప్‌ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ హాల్‌ను బుక్‌ చేశాడు. ఈ వివాహానికి సందీప్‌ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించాడు.

ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్‌, బెయిల్‌పై ఉన్న ఓ మహిళా క్రిమినల్‌కు వివాహం నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్‌వార్‌ జరిగే అవకాశం, లేదా కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకునేందుకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్‌ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరించారు.  250 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. 

కాగా హరియాణాలోని సోనిపట్‌కు చెందిన సందీప్‌ ఒకప్పుడు అతని తలపై రూ. 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్.  తీహార్‌ జైల్లోఉ న్న సందీప్‌.. పెళ్లి కోసం ఢిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇచ్చింది. ఇక ‘రివాల్వర్ రాణి' గా పేరొందిన అనురాధ చౌదరి అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు.  నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు సందీప్‌ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి కేసులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement