ఆరు రోజులుగా ఎయిమ్స్‌ సర్వర్‌ హ్యాక్‌

Hackers demand Rs 200cr in cryptocurrency from AIIMS - Sakshi

రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తున్న హ్యాకర్లు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడకల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)  సర్వర్‌ హ్యాకైంది. ఆరు రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషిచేస్తోంది. ఢిల్లీ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్, స్ట్రాటెజిక్‌ ఆపరేషన్స్‌ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

బుధవారం ఉదయం స్తంభించిన సర్వర్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది రోగుల ఆరోగ్య, బిల్లుల చెల్లింపుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. డేటా అంతా అమ్మకానికి వస్తే అప్రతిష్ట తప్పదని పోలీసు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల ఆరోగ్య సమాచారం సైతం సర్వర్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే హ్యాకర్లు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top