వలపు వలతో పక్కా స్కెచ్‌..ఏకంగా ఢిల్లీ హైకోర్టు పేరుతోనే రూ.2.69 కోట్లు..

Gujarat Businessman Allegedly Lost Rs 2 Crore Video Call Trap - Sakshi

గుజరాత్‌ వ్యాపారవేత్తని ఒక మహిళ మాయమాటలతో ఉచ్చులోకి దింపి ఏకంగా రూ.2.69 కోట్లు కొల్లగొట్టింది. బలవంతంగా వీడియోకాల్స్‌ మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి, కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి పలు దఫాలుగా డబ్బులు కొల్లగట్టారు. చివరికి బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకెళ్తే..పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న ఒక పారిశ్రమాకవేత్తకి గతేడాది ఆగస్టు8న రియా శర్మ అనే మహిళ నుంచి కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆ వ్యక్తిని బట్టలు లేకండ వీడియో కాల్‌ మాట్లాడేలా చేసింది. ఆ తర్వాత అనుహ్యంగా ఫోన్‌ కాల్‌ కట్‌ అయ్యింది. కాసేపటికి ఆ వ్యాపారవేత్తని మీ నగ్న వీడియో సర్యూలేట్‌ కాకుండా ఉండాలంటే రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మరికొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ గుడ్డుశర్మ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేసి ఏకంగా ఆ వీడియో క్లిప్‌ తన వద్ద ఉందని పేర్కొంటూ ఏకంగా రూ. 3 లక్షలు దోచేశాడు. సరిగ్గా ఆగస్టు14న మరో కాల్‌లో.. మీరు వీడియోకాల్‌ మాట్లాడిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆమె తల్లి మీపై కేసు పెట్టిందుకు సీబీఐని అశ్రయించందంటూ బాంబుపేల్చారు. ఈసారి ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్‌ చేశారు.

సదరు బాధితుడు కేసు అనేసరికి బెంబేలెత్తి...ఎంత డబ్బైనా చెల్లించి ఈ కేసు నుంచి బయటపడాని అనుకున్నాడు. ఆ దుండగలు ఫేక్‌ ఢిల్లీ హైకోర్టు పేరుతో డిసెంబర్‌ 15 వరకు బాధితుడు నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. చివరి కేసు క్లోజ్‌ అయ్యిందంటూ ఒక ఉత్తర్వు చేతిలో పెట్టారు. అప్పుడు ఆ ఉత్తర్వు చూడగానే అనుమానం తలెత్తి సైబర్‌ క్రైంని ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, దాదాపు 11 మందిపై కేసు పెట్టాడ. అంతేగాదు తన నుంచి సుమారు రూ. 2.69 కోట్లు దోపిడీ చేసినట్లు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

(చదవండి: అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్‌? )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top