
ధర్మసందేహం
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయం ఉత్తరాయణ పుణ్య కాలం ఇక దక్షిణాయనం అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే సమయం ఉత్తరాయణాన్ని మాత్రమే పుణ్యకాలం అంటారు అలాగని దక్షిణాయనం పాప కాలమేమీ కాదు. అదీ పుణ్యప్రదమైనదే. ఎందుకంటే మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.
శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం... శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన వ్రతం దక్షిణాయనంలోనే చేస్తాం.
అయితే దక్షిణాయనం అనేది దేవతలకు రాత్రికాలం కాబట్టి దేవతారాధనకు ఉత్తరాయణం, పితృదేవతా రాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనదని పెద్దలు చెబుతారు. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు దక్షిణా యనంలోనే వస్తాయి.
శ్రీమహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే, రుద్రారాధన, గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో΄ాటు పితృపక్షాలు, విశేషమైన దసరా, దీపావళి పంటి పండుగలన్నీ దక్షిణాయనంలో వస్తాయి. ప్రస్తుతం మనం దక్షిణాయనంలోనే ఉన్నాం.
వర్జ్యం అంటే ఏమిటి?
ఈ కాలంలో ఏ పనులూ చేయకూడదా?ఉత్తరాయణం... దక్షిణాయనం ఏది ఉత్తమ కాలం?జ్యోతిష్యంలో వర్జ్యాన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది. ఇంతకీ వర్జ్యం అంటే ఏమిటీ అంటే విడువ తగిన కాలం.
వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలు దేరడం కాని చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది.
వర్జ్యకాలంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతోపాటు, శక్తి కొద్దీ దానం దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవడం వల్ల ఆయా దోషాలు తొలగి కార్యానుకూలత కలుగుతుంది.