దేవతలారా రండి....కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించండి అంటూ గరుత్మంతుడు సకల దేవతలను ఆహ్వానించాడు.
తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వేద పండితులు ధ్వజారోహణం నిర్వహించారు.
ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్ తదితరుల అర్చక బృందం ఆధ్వర్యంలో క్షేత్ర నాయకుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిసేలా గరుడిని చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు.
అనంతరం అలంకరించిన తిరుచ్చి వాహనంపై స్వామిని ఊరేగించారు.


