
గోల్కొండ కోట కిటకిటలాడింది.ఆదివారం నాలుగో బోనం పూజలు ఘనంగా నిర్వహించగా.. భక్తులు పోటెత్తారు. మహిళలు బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, నృత్యాలతో కోటంతా సందడి నెలకొంది. మహిళా భక్తులకు అడుగడుగునా భక్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

























