
కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, పాణ్యం మండలం, ఎస్.కొత్తూరు గ్రామంలో ఉన్న ఒక పురాతన ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి 12 శిరస్సులు కలిగిన నాగదేవుని రూపంలో ఉంటారు.స్వామివారు వల్లీ, దేవసేన సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారు. ఈ తరహా ఆలయం భారతదేశంలోనే అత్యంత అరుదైన ఆలయంగా చెబుతారు.

భక్తుల కోరికలు నెరవేర్చే శక్తివంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

















