శ్రీశైల మహాక్షేత్రం కార్తీక శోభితంగా మారింది. కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీశైలం భక్తులతో పోటెత్తింది.
వేకువజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు.
లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతిని నిర్వహించారు.
పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఉత్సవమూర్తులను పుష్కరిణి వద ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజలు నిర్వహించారు.


