
అమరలింగేశ్వరుడు (Sri Amaralingeswara Swami Temple) ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్దమైన బిలం (గుహ)లో కొలువై ఉన్నాడు.

ఈ కొండ గుహలోగల (Daida Bilam) ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభువుగా శివలింగం రూపంలో వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు

కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.

కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో 900 మీటర్లు నడచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు.

గుంటూరు జిల్లా, గురజాల నుంచి 12 కిలో మీటర్లు, పులిపాడు, దైద మార్గం నుంచి 5 కి.మీలో ఈ శైవ క్షేత్రం ఉంది.

గుహలో ఉన్న అమరలింగేశ్వరస్వామిని దర్శించటం కష్టంతో కూడుకుంది.

గుహ లోపలకి ప్రవేశించిన తరువాత 500 మీ. దూరంలో అమరలింగేశ్వరస్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు.

గుహలో లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి.




















