
తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

కన్నుల పండువగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ రోజు (గురువారం) చిన్నశేషవాహనం, హంసవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి వైభవాన్ని దర్శించుకునేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు.








