breaking news
chinna sesha vahanam
-
తిరుమల : చిన్నశేష వాహనంపై శ్రీవారు
-
చిన్నశేషవాహనంపై శ్రీవారు
-
చిన్నశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గురువారం చిన్నశేషవాహనంపై ఊరేగారు. విశేషంగా అలంకరించిన శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల గిరులు బ్రహ్మోత్సవ శోభతో కళకళలాడుతున్నాయి. ఆలయ మహద్వారానికి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో మెరుస్తోంది. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్పవర్ల ఊరేగింపు సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణ మర్మోగింది. ఇక ఫల, పుష్ప ప్రదర్శనశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రదర్శన శాలలో దేశీయ పుష్పాలతో పాటు విదేశాల పుష్పాలతో అలంకరించారు.