ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణానదికి వరద.. శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్న నీరు
ఉమ్మడి కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరుడు జలాధివాసంలోకి వెళ్లాడు.
ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంత సమీపంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది
సుమారు 8 నెలల పాటు ఈ ఆలయం నీటిలోనే ఉంటుంది.
కొంత సమయం క్రితం ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలకపల్లి రఘువర్మ శాస్త్రి
శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 837 అడుగులకు చేరింది.
ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి )
ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని చెబుతారు.. 1500 ఏళ్ల చరిత్రకు సంబంధించిన ఆధారాలు మాత్రమే ఉన్నాయి.
పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు.
ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది.


