
మన ఆత్మ ప్రాపంచిక విషయాలపై, వస్తువ్యామోహాలపై చిక్కుకున్నప్పుడు మన చిత్తం భౌతిక పరమైన విషయాలతో కప్పబడి, అది ఒక స్థాయి వరకు పెరిగి అక్కడ ఒకముడి ఏర్పడుతుంది. దానివలన మీరు కేవలం ఆ వస్తు ప్రపంచాన్నే చూస్తారు కానీ ఆత్మను కాదు. పదార్థానికి, ఆత్మకు మధ్యన గల ముడిఇదే. దీనినే ’జడ ప్రకృతి’ అని సంస్కృత భాషలో అంటారు. ఇదే ప్రథమ ముడి. ఎంతో సంక్లిష్టమైన ముడి.
మీరిలా అనుకుంటారు. ‘ఈ రత్నం నాది, ఇదిగోఈ కుర్చీ నాది దానినుండి తనను దించేస్తారేమోనని అనుమానిస్తూ, తన కుర్చీని కాపాడుకోవాలనే ప్రణాళికలు వేస్తూ, ఎప్పుడూ ఆ పనిలోనే ఉంటాడు. ఆ కుర్చీ జీవం లేనిది. ఆ పదవి కూడా జీవం లేనిదే. ఈ ముడి పృథ్వీతత్వంతో ఏర్పడుతుంది. ఆ విధంగా భూతత్వ మూలకం అయిన మూలాధార చక్రం నుండి మొదలై, క్రమేపీ ఇడానాడి పైకిప్రాకుతూ ఆజ్ఞా చక్రం వద్ద ప్రత్యహంకారాన్ని కలుగజేస్తుంది. ఎక్కడయితే ముడి ఉంటుందో, అక్కడ ఆ ముడి విప్పబడటం కూడా ఉంటుంది. సహజయోగం ద్వారా అటువంటి ముడినుండి బయట పడటం చైతన్య తరంగాల ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ముడి విడి΄ోతుందో, అప్పుడే కుండలిని ఉత్థానం ప్రారంభం అవుతుంది. ఇది మొదటి ముడి. అది చాలా ముఖ్యమైనది.
– డాక్టర్ పి. రాకేష్
(పరమ పూజ్య శ్రీ మాతాజీ ప్రవచనాల ఆధారంగా)