breaking news
atma jyothi
-
మనిషి దుఃఖం నుండి బయటపడలేకపోవడానికి కారణం ఇదే!
ఆత్మ చాలా బలమైనది. ఆత్మ సహకారంతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. వ్యక్తి అనే ముసుగు నుండి, అహంకారపూరితమైన మనస్సు నుండి అతీతంగా ఎదగడం సులభమవుతుంది. అప్పుడు నీవు నీ ఆలోచనలతో, నమ్మకాలతో విడిపడతావు. నీ స్వస్థలమైన ఆత్మను చేరుకుంటావు. ఒక చేపలమ్ముకునే అమె పూలమ్ముకునే వాళ్ళ ఇంట్లో బస చేయాల్సివస్తుంది. ఆమె చేపలవాసనకు అలవాటుపడి ఉండటం వల్ల ఆ ఇంట్లోని పూలవాసనకు నిద్ర పట్టదు. అప్పుడామె తాను అమ్ముకోవడానికి తెచ్చుకున్న ఎండుచేపల మీద నీరు చల్లి, అప్పుడు వచ్చిన వాసనను పీల్చుకుంటూ నిద్రపోతుంది. అంటే మనం అలవాటుకు బానిసలం కావడం వల్ల అది తప్పు అని తెలిసినా మానుకోము. అందులోనే కూరుకునిపోతాం. అందువల్లే మనిషి దుఃఖం నుండి బయటపడలేక పోతున్నాడు. ఆత్మ వెదజల్లే పరిమళాన్ని కాదని మనస్సుకు బందీయై జీవితమంతా గడిపేస్తున్నాడు.గత జ్ఞాపకాలను అన్నింటినీ అధిగమించేయాలి. అది ధ్యానం ద్వారానే సులభమవుతుంది. భవిష్యత్తు లేదు, ఊహలు లేవు, లక్ష్యాలు లేవు, సమస్యలు లేవు.... కేవలం ఈ క్షణంలో ఉంటావు. ఆ ప్రస్తుత క్షణానికి ఏ రూపమూ లేదు. అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆత్మానుభవం జరుగుతుంది. అదే నీ నిజతత్వం. అక్కడ వ్యక్తిగా ఉండవు. కొన్ని లక్షల, కోట్ల జన్మలక్రితం ఆత్మ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంకో కోటి జన్మల తర్వాత కూడా అలాగే ఉంటుంది. సష్టి కూడా అలాగే ఉంటుంది. అది కాలానికి అతీతమన్నమాట. అది–అంతం లేవు. ఆ ఆత్మ తత్వంలో నీవు ఉన్నప్పుడు పుస్తక జ్ఞానమే అవసరం లేదు. నీవు చెప్పిందే జ్ఞానమవుతుంది.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
మంత్రాలయంలో పుణ్యహారతి
మంత్రాలయం : '' వరాహ వదనోద్భవతే శ్రీశైలోత్సంగ గామిని! తుంగభద్రే మహాపుణ్యే నమోస్తుతే సురప్రియే!!''.. అంటూ తుంగభద్రమ్మను స్మరిస్తూ భక్తలోకం ఆత్మజ్యోతులను సమర్పించుకుంది. కార్తిక పూర్ణిమను పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పుణ్యహారతి నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా బయలు దేరారు. శ్రీమఠం ప్రాంగణం ఎదుట కార్తిక ఘటం జ్యోతి ప్రజ్వలన చేశారు. అక్కడి నుంచి గజరాజు, మంగళవాయిద్యాలు, భజనలతో ఊరేగింపుగా తుంగభద్ర తీరం చేరుకున్నారు. తుంగభద్ర నదికి శాస్త్రోక్తంగా అర్చనలు చేశారు. అర్చకులు వేదపఠనం గావిస్తూ సప్త హారతులు పట్టారు. శ్రీమఠం చేరుకుని గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాంగణంలో భజనలు చేశారు. దీపోత్సవంలో జిల్లా కోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈవో ఈశ్వర్ పాల్గొన్నారు.