
నదిని చూసిన మది ఉప్పొంగింది. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది. చల్లని తల్లికి నమ స్కరించాక భయం పటాపంచలైంది. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది

కాళేశ్వరానికి వచ్చిన వారు భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు

'సల్లంగ సూడు సరస్వతమ్మా' అంటూ నీటిలో దీపాలు వదిలారు

గోదావరి మాతకు చీరసారె సమర్పించారు

కాళేశ్వర ముక్తీశ్వ రున్ని దర్శించుకున్నారు

శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది

సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు














