
జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు.

నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు.

50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు

ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్‌లో బారులుదీరిన భక్తజనం









