కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న దేవాలయం.
మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది.
తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు దేవాలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు.
అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడుకొండల మధ్య స్వయంభూవంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామి పేదల తిరుపతిగా మొక్కులందుకుంటున్నాడు.
స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం.
రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర పూజిస్తారు.
తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామికి ‘ఉద్దాల మండపం’ ఉంది
మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.


