
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవంతో తిరుగిరులు విరాజిల్లుతున్నాయి. బ్రహ్మోత్సవ శోభతో దేదీప్యంగా కాంతులీనుతున్నాయి.

ధ్వజ పటం తేజస్సుతో నూతన వెలుగులను సంతరించుకున్నాయి. గోవిందనామస్మరణలతో మార్మోగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఏడు పడగల పెదశేషునిపై విహరిస్తున్న వైకుంఠనాథుని వీక్షించి భక్తజనులు పరవశించారు.

ఉభయ దేవేరీ సమేతంగా ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకుని పునీతులయ్యారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు.














