
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో వెనకడుగు వేసే ప్రకస్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో బీసీ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ కుల సర్వేకు ఆద్యులు రాహుల్ గాంధీ. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్రీయ బద్దంగా కుల సర్వే నిర్వహించి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్‌కే కట్టుబడి ఉన్నాం.
బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నాం. బంద్ విజయవంతం కావాలి. బీసీ బంద్‌తో కనువిప్పు కలగాలి. అసెంబ్లీలో మద్దతు ఇచ్చి బయటకు వచ్చి మోకాలడ్డు పడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి నినాదం.. ఉద్యమంగా మారింది. రాహుల్ గాంధీ నినాదం గొప్ప వరం
బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పరంగా పోరాడుదాం. రాజకీయాలు ఎన్నికల వరకే. రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది. రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారు. బీజేపీ బిఆర్ఎస్‌లో పాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం. సిఎం రేవంత్,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్!