
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.
కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్‌తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే.
..దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
