హరీశ్‌కు కవిత పరామర్శ | Kavitha Offers Condolences To Former Minister Harish Rao Father Death, More Details | Sakshi
Sakshi News home page

హరీశ్‌కు కవిత పరామర్శ

Oct 31 2025 7:55 AM | Updated on Oct 31 2025 10:30 AM

Kavitha Console Harish Rao

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం పరామర్శించారు. తన భర్త అనిల్‌తో కలిసి కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

హరీశ్‌రావు కుటుంబానికి కవిత దంపతులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్‌రావు తల్లి, తన మేనత్త అయిన లక్ష్మిని కవిత పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంతోపాటు పలువురు ప్రముఖులు కూడా హరీశ్‌ నివాసానికి వెళ్లి ఆయన తండ్రి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement