కేటీఆర్‌పై అక్రమ కేసు.. రేవంత్‌ రాక్షసానందం: హరీష్‌ | BRS MLA Harish Rao Serious Comments On Congress And Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై అక్రమ కేసు.. రేవంత్‌ రాక్షసానందం: హరీష్‌

Nov 20 2025 1:50 PM | Updated on Nov 20 2025 2:50 PM

BRS MLA Harish Rao Serious Comments On Congress And Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆరోపించారు.

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాజీ ‍మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ సందర్బంగా హరీష్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి.  

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement