హైదరాబాద్‌: లోటస్‌పాండ్‌ చేరుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Hyderabad Nampally CBI Court Visit News Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

YS Jagan Hyderabad Visit: జగన్‌ రాకతో పోటెత్తిన అభిమానం

Nov 20 2025 9:50 AM | Updated on Nov 20 2025 1:04 PM

YS Jagan Hyderabad Nampally CBI Court Visit News Updates

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Hyderabad Visit) రాకతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనతో ముందుకు కదులుతూ జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. 

జగన్‌ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం.. ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్‌ ముందుకు కదిలారు. భారీ ర్యాలీగా నాంపల్లికి చేరుకున్నారు.  

 

ఇటీవల వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్‌ ఇచ్చారు. జగన్‌ రాక నేపథ్యంతో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని.. న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. ‘‘హాజరును కోర్టు రికార్డు చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్లీ  కోర్టుకు రావాల్సిన అవసరం లేదు’’ అని జగన్‌ తరఫు లాయర్‌ మీడియాకు తెలిపారు.

కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్‌పాండ్‌ నివాసానికి చేరుకున్నారు. 

ఇదీ చదవండి: కుమ్మక్కై జగన్‌పై అక్రమ కేసులు.. కుట్రలు పన్ని దుష్ప్రచారం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement