
బీసీ రిజర్వేషన్లపై మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు.