breaking news
bc reservation
-
వచ్చే నెల 30లోగా స్థానిక సమరం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో కేంద్రం నుంచి గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు ఆగిపోయాయి.దీంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్ది గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్‌షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్‌కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్‌కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్‌లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్‌చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగం సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తమది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసమే తమ ఆరాటమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి బీజేపీ వైఖరిని బయట పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి కవిత సూచించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం కవిత ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 72 గంటల దీక్షకు దిగారు. హరియాణాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలాతోపాటు వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు కవితకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో రాజ్యాధికారంలో అందరికీ వాటా రావాలని, బీసీలకు ప్రాధాన్యం దక్కాలని కవిత డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం: బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కూడా వాటా ఉందన్న అనుమానంతో బిల్లులను ఆపుతున్నామని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని కవిత అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రత్యేకంగా ముస్లింల కోసం పది శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే టైమ్ పాస్ ధర్నాలతో సాధించేదేమీ లేదని, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతిని కలవడంతోపాటు ఆర్డినెన్స్ ఆమోదంలో గవర్నర్ జాప్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఆగస్టు 8 తర్వాత కవిత దీక్ష చేసేందుకు.. పోలీసులు హైకోర్టు ఎదుట సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టులపై ఉన్న గౌరవంతో తన దీక్షను విరమిస్తున్నట్టు కవిత ప్రకటించారు. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం తన పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకిలించాలి: అర్జున్‌సింగ్ చౌతాలా కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించాలని ఐఎన్ఎల్డీ నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలా పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ కోసం కవిత చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. -
బీసీ కోటాపై ఢిల్లీకి..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 6న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ప్రజా ప్రతినిధులందరితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని, జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించింది.7న ముఖ్యమంత్రితో పాటు మంత్రు లు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున బీసీల రిజర్వేషన్ల బిల్లు ల ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని తీర్మానించింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. బీసీ మంత్రుల విలేకరుల సమావేశం.. బీసీలకు స్థానిక సంస్థల్లో అలాగే విద్యా, ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రతిపాదించిన రెండు బిల్లులను గత మార్చి 17న రాష్ట్ర శాసనసభ, మార్చి 18న శాసనమండలి ఆమోదించాయి. ఈ రెండు బిల్లులను మార్చి 22న రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించగా, ఆయన మార్చి 30న రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే రాష్ట్రపతి వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు.మరోవైపు 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఇటీవల ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు.. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటూ గడువు విధించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులతో స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపడి ఉండడంతో వాటి సాధన కోసం ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచాలని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కాగా కేబినెట్ భేటీ తర్వాత..బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సహచర బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి క్లుప్తంగా వివరాలు వెల్లడించారు. కేసీఆర్ తీరని ద్రోహం చేశారు ‘లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలతో పాటు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్తారు. తెలంగాణలోని బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు కూడా ఢిల్లీకి తరలిరావాలి. గతంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనను 2018లో తెచి్చన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచి బీసీలకు తీరని ద్రోహం చేశారు. ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసేందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని గత జూలై 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి, 14న గవర్నర్ ఆమోదం కోసం పంపించాం.ఆ ఆర్డినెన్స్ ఫైలును సైతం రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఆర్డినెన్స్‌ను తక్షణమే ఆమోదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయటంతో పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది..’అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.రవాణా శాఖ చెక్ పోస్టులు రద్దు రవాణా శాఖకు సంబంధించి రాష్టంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఇలాంటివి మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. అయితే జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇకపై సిబ్బందితో కాకుండా వాహన్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. అన్నిచోట్లా మైక్రో బ్రూవరీస్ కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతలు సహకరించాలి ‘బిల్లులు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదించేలా రాష్ట్రంలోని కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, అరవింద్, ఈటల రాజేందర్, కృష్ణయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయతి్నంచాలి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా బిల్లులకు ఆమోదముద్ర పడేలా సహకరించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇందిరా సాహ్నీ కేసులో ఇచి్చన తీర్పులోనే.. శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఆ పరిమితి దాటవచ్చని కూడా పేర్కొంది. పక్కాగా నిర్వహించిన సర్వే ఆధారంగానే మేము బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ కోటాతోనే 50 శాతం క్యాప్ పోయింది. ఇప్పుడు 64 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నాయకత్వం వహించి ఢిల్లీకి రావాలి. ఆయన ఈ విషయంలో మౌనం వీడాలి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే మంచిది. లేకుంటే సామ, భేద, దాన దండోపాయాలను ఉపయోగిస్తాం..’అని మంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే..!⇒ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో విస్తృత చర్చ ⇒ ఆగస్టు 7 వరకు పోరాటం.. ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ⇒ పట్టణ గృహ నిర్మాణ పాలసీపై కూడా చర్చించిన మంత్రిమండలి ⇒ నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని బీసీ వర్గాల ప్రజలు విశ్వసించడం లేదని అభిప్రాయపడింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, మంత్రిమండలి ఆమోదించిన ఆర్డినెన్స్ అమల్లోకి రావడానికి ఉన్న అవకాశాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. హైకోర్టును మరింత గడువు కోరే యోచన జాతీయ స్థాయిలోని రాజకీయ పారీ్టల సహకారం తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిన మంత్రివర్గం.. ఆగస్టు 7వ తేదీ తర్వాత మరింత స్పష్టంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచి్చన అనంతరం అవసరమైతే 10వ తేదీ తర్వాత మరోమారు మంత్రివర్గం సమావేశమై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టును మరికొంత గడువు కోరాలనే చర్చ కూడా వచి్చనట్టు సమాచారం. హౌసింగ్ పాలసీ ఎలా? రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన హౌసింగ్ పాలసీ గురించి కూడా మంత్రిమండలి చర్చించింది. ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యల గురించి మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో జీ ప్లస్ 3 విధానం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా చర్చించిన కేబినెట్.. ఈ పాలసీ గురించి స్పష్టమైన నోట్ తయారు చేయాలని సంబంధిత ఆధికారులను ఆదేశించింది. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా కేబినెట్ చర్చించింది. బుగ్గమాదారం, ముక్తేశ్వరపురం లిఫ్టులతో పాటు మరి కొన్నింటికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. -
ఆగస్ట్ 6న ఢిల్లీకి సీఎం బృందం.. ‘బీసీ బిల్లు’పై ధర్నా!
హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) ఆరో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి పయనం కానుంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తేల్చుకోవడానికి సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించేందుకు గాను బీసీ బిల్లును తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోద ముద్ర కావాలి. ఈ క్రమంలోనే ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ ధర్నా చేయాలని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ రోజు(సోమవారం. జూలై 28) జరిగిన కేబినెట్ భేటీలో బీసీ బిల్లు అంశానికి సంబంధించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ,ఎమ్మెల్యే లు ,ఎంపీలు ఢిల్లీ వెళ్లి బీసీ బిల్లుపై డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ ‘ ఈడబ్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం క్యాప్ ఎప్పుడో ఎత్తేసారు. ఆర్ కృష్ణయ్య మౌనం వీడాలి... మాతో కలసి రావాలి. ఇండీ కూటమి పార్టీలతో కలసి పోరాటం చేస్తాం. రిజర్వేషన్ల కోసం సామ ధాన దండన ఉపయోగిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను ఎందుకు తొలగించడం లేదు. అక్కడ తొలగించి మమ్మల్ని అడగాలి. బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని బీజేపీకి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’ అని మండిపడ్డారు. -
పార్లమెంటులో పోరాడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ హామీ మేరకు తమ ప్రభు త్వం కుల గణన చేసి, ఆ మేరకు బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్‌గాం«దీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తాను, తన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలందరం జంతర్‌మంతర్ వద్ద పోరాడతామని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు.ఈ సర్వేకు సంబంధించిన 88 కోట్ల పేజీల డేటా తమ వద్ద ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులపై..ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంగా సీఎం మాట్లాడారు. రాహుల్ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన ‘భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, ఫిబ్రవరి 4వ తేదీన ఈ మేరకు సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 5న అంటే ఏడాది కాలంలోనే పూర్తి చేశాం. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కులగణన చేపట్టే సమయంలో అనేకమంది అగ్ర కులాల నాయకులు నా వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారు. కాలనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని నేను వారికి సూచించా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయి. అనేక మంది అమరులయ్యారు. కానీ 2009, డిసెంబర్ 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ నెరవేర్చారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని మా ప్రభుత్వం నెరవేర్చింది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నిలుపుకుంటుంది ‘బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరు. గాంధీ కుటుంబం చెప్పిన ప్రతి మాటను నిలుపుకుంటుంది. కుల గణనకు సంబంధించి మా ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించింది. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారు. 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారు. ఇది తెలంగాణలో సరికొత్త పరిణామం. వీరంతా ఎవరని.. సర్వే, స్వతంత్ర నిపుణుల బృందాలు పరిశీలించాయి. వాళ్లంతా ఇంగ్లీష్ అభ్యసించిన ఉన్నత విద్యావంతులని తేలింది. ఈ సర్వే ప్రకారమే మేము బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం..’ ముఖ్యమంత్రి తెలిపారు. మోదీ లీగల్లీ కన్వెర్డెడ్ బీసీ.. ‘బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ. మేము కుల గణన చేపట్టబోమని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చెప్పారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించింది. ఇదంతా రాహుల్ గాంధీ ఘనతే. మేము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్. ఇది తెలంగాణ మోడల్. నేను దీనిని ‘రేర్’ (ఆర్ఏఆర్ఈ) మోడల్ అంటున్నా. ఆర్ఏఆర్ఈ..అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తా..’ అని రేవంత్ అన్నారు. సోనియాగాంధీ లేఖ నాకు నోబెల్, ఆస్కార్ లాంటిది ‘కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియాగాంధీ స్వహస్తాలతో నాకు లేఖ రాశారు. ఆ లేఖ నాకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారాలతో సమానం. నేను ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ నాకు ప్రత్యేకంగా మిగిలిపోతుంది..’ అంటూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ బీసీ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ప్రసంగించారు. మహేశ్‌గౌడ్ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, స్వతంత్ర నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఖర్గే, రాహుల్‌తో సీఎం బృందం భేటీ గురువారం ఉదయం ఖర్గే నివాసంలో ఆయనతో పాటు, రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన సర్వే ప్రక్రియ, శాసనసభలో బిల్లుల ఆమోదం, పార్లమెంట్లో వాటిని ఆమోదింప జేయడంపై చర్చించారు. -
తెలంగాణ కులగణనపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ప్రజెంటేషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, నిపుణుల కమిటీ సభ్యులు కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్ చుట్టే అంతా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ చుట్టే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రాతిపదికగా సర్వత్రా చర్చ సాగుతోంది. కేంద్రం అనుమతి పొందేలా ఒత్తిడి తీసుకుని వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించిన రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు ఏ మేరకు అవకాశం ఉందన్నదీ ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకు వీలుగా గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరిస్తూ, కాంగ్రెస్ సర్కార్ తాజాగా ముసాయిదా ఆర్డినెన్స్‌ను ఆమోదించడం తెలిసిందే కాగా..ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ ఏమైందనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ఇంకా రాజ్‌భవన్‌కే చేరలేదనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. మరోవైపు గవర్నర్ న్యాయ సలహా కోరినట్టు, అడ్వకేట్ జనరల్‌ని పిలిపించి 50 శాతానికి మించి రిజర్వేషన్ల పెంపుదలకు ఏ మేరకు అవకాశం ఉందని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వాస్తవంగా ఆర్డినెన్స్ పరిస్థితి ఏంటి? ఎక్కడుంది? అనే సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికలపై నేతల్లో ఉత్కంఠ హైకోర్టు ఆదేశాల మేరు సెపె్టంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాల్లో, పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు రెండు టర్మ్‌ల పాటు ఉండగా...ఇప్పుడు ఒక్కసారికే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు జెడ్పీపీలు 31కే (మేడ్చల్ మల్కాజిగిరి జడ్పీపీ కనుమరుగు) పరిమితం కావడం, మేడ్చల్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లోని పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం లేదా కొత్త పురపాలికల ఏర్పాటు వంటి వాటితో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లలో పీఆర్‌శాఖ, ఎస్ఈసీ బిజీ బీజీ... రిజర్వేషన్ల పెంపుదల ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొంది, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా..ఆ వెంటనే కార్య రంగంలోకి దూకేలా పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నద్ధమౌతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లలో పీఆర్ఆర్డీ అధికారులు, ఉద్యోగులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను సరిపోల్చుతూ గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను కార్యదర్శులు ఇప్పటికే రూపొందించారు. ఈ జాబితాలను ఎస్ఈసీ వెబ్సైట్లోనూ రిజిష్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే..స్థానిక ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలకు సంబంధించి నిర్దేశిత ఫార్మాట్లలో వివరాలు పంపించాలని సూచించింది. సెపె్టంబర్ 30 లోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. జిల్లాల్లోని పరిస్థితులు, శాంతిభద్రతల సమస్యలు, తదితరాల ప్రాతిపదికన రెండు లేదా మూడుదశల్లో ఎన్నికల నిర్వహణపై అవపరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. ఒక మండలంలోని అన్ని పంచాయతీలకు ఒకేదశలో ఎన్నికల జరిపేలా చూడాలని పేర్కొంది. కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొత్తగా పోలింగ్ స్టేషన్లజాబితాలను సిద్ధం చేసి పంపించాలని ఎస్ఈసీ సూచించింది. -
సిందూర్‌తో పాటే బీసీ రిజర్వేషన్లు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదంపై చర్చించేలా పట్టు పట్టాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ ముఖ్య నాయకత్వం కోరనుంది. ఈ మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత, రిజర్వేషన్ల ఖరారుకు ఉన్న సమయం తదితర అంశాలపై హైకమాండ్‌తో మరోసారి మాట్లాడిన తర్వాత, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఇవ్వాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చారు.ఈ నెల 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి దేశంలోని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ పీపీటీ ద్వారా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నారు. అంతకంటే ముందు రాహుల్, ఖర్గేలతో ఇరువురు నేతలు ఈ అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళుతున్న తెలంగాణకు మద్దతివ్వాలని, ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలను సీఎం కోరనున్నారు.పీపీటీ అంశాలపై భట్టి, ఉత్తమ్లతో చర్చ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొనాల్సిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో రేవంత్‌రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఈ చర్చలు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగాయని తెలుస్తోంది. ముఖ్యంగా కులగణన, అసెంబ్లీలో బిల్లు, కులగణనపై నిపుణుల నివేదిక తదితర పరిణామాలకు సంబంధించి పీపీటీలో పేర్కొనాల్సిన కీలకాంశాలపై వీరు చర్చించారని, ఈ నెల 24న ఇవ్వాల్సిన పీపీటీ మంగళవారం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని సమాచారం. ఇందిరా భవన్లో పీపీటీ: మల్లు రవి సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కనీ్వనర్ మల్లు రవి వెల్లడించారు. ఈ నెల 24 సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఈ కార్యక్రమం ఉంటుదన్నారు.సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీలు రామసహాయం రఘురామి రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, సీఎం అనే కనీస మర్యాద లేకుండా రేవంత్ రెడ్డిపై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందని చెప్పారు. -
TG: ‘బీసీ’ బిల్లులు ఏకగ్రీవం
బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.-సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు ఆమోదం పొందాయి. అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ రెండు బీసీ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. తర్వాత సాయంత్రం వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లులపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదాం.. బీసీ బిల్లులపై చర్చ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీలకు 37శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును గతంలో అసెంబ్లీ ఆమోదించింది. దానికి సంబంధించిన తీర్మానం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. సాంకేతిక కారణాల రీత్యా గతంలో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని, కొత్తగా అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తామని మా నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అడుగులు వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోనని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుదామన్నారు. ఏకాభిప్రాయంతో వెళదాం.. నాయకత్వం వహిస్తా.. బీసీల లెక్క తెలియకపోవడం వల్లే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రం కులగణన సర్వే చేపట్టామన్నారు. ‘‘బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును చట్టం చేసేలా కేంద్రంపై అన్ని పక్షాలు ఒత్తిడి పెంచాలి. దీనిపై తెలంగాణ సమాజం ఏకాభిప్రాయంతో ఉందనే సందేశాన్ని కేంద్రానికి పంపాలి. బీసీ రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా. అఖిలపక్ష నాయకులంతా సమైక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలుద్దాం. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి. మేం రాహుల్ గాం«దీని కలసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతాం. ఆయనను కలిసే బాధ్యత, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేలా చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అప్పగిస్తాం..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చేసే బాధ్యత ప్రతి పార్టీపైనా ఉందన్నారు. చట్టబద్ధత లభించేలా శాస్త్రీయంగా చేశాం: భట్టి విక్రమార్క బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు కసరత్తు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. శాస్త్రీయంగా, పకడ్బందీగా 50రోజుల్లో దీనిని పూర్తి చేశామని చెప్పారు. ‘‘దేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే.. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను మోడల్‌గా తీసుకునేంత శాస్త్రీయంగా చేయించాం. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేశాం..’’ అని భట్టి వివరించారు. కుల గణనలో బీసీలు 50.36 శాతం ఉన్నట్టు తేలిందని.. దీని ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం సభలో తీర్మానం పెట్టామన్నారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం: పొన్నం ప్రభాకర్ తమిళనాడులో మొత్తం 68శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన కూడా ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లతో తొలగిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయన్న సంకేతం పంపిద్దామని.. ఎవరేం చేశారన్నది మరోసారి చర్చించుకుందామని చెప్పారు. బీసీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. బీజేపీకి ఇది శీలపరీక్ష లాంటిదని, ఆ పార్టీ వ్యాపారుల పార్టీనా, బీసీల పార్టీనా తేలిపోతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులకు అవకాశం: కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద పేర్కొన్నారు. బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ల పేర్లతో శాస్త్రీయత లేకుండా బీసీ రిజర్వేషన్లను నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా అదే చెప్తున్నారని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జరిపారని పేర్కొన్నారు. అయితే వివేకానంద చెప్పిన అంశాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ బిల్లును ఆమోదిస్తుందని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ప్రసంగించారు. స్వీట్లు తినిపించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం పొందడం మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి, బీసీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించుకున్నారు. -
బీసీలకు 42% కోటా
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో, విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే మరో ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు విలేకరులకు వెల్లడించారు. చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ గత నెల 3న సమర్పించిన తొలి విడత సిఫారసులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగులేటి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 37 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2017లో సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇక 3 సెక్టార్లుగా రాష్ట్రం! ‘రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ ఏరియాగా, అక్కడి నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డుకు ఆవల 2 కి.మీల బఫర్ జోన్ వరకు ఫ్యూచర్ సిటీగా, మిగిలిన ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా విభజించాలని నిర్ణయించాం. రూరల్ తెలంగాణ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావు. 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉన్న 30 కి.మీల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశాం. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులను ఆమోదించాం. హెచ్ఎండీఏ పరిధి విస్తరణ హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డుకు 2 కి.మీల బఫర్ జోన్ వరకు పొడిగించాం. 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించింది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి..’ అని పొంగులేటి తెలిపారు. సెర్ప్, మెప్మా విలీనం ‘కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ–2025ని కేబినెట్ ఆమోదించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అందించిన సహకారాన్ని మళ్లీ కొత్త పాలసీతో పునరుద్ధరిస్తాం. మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించాం. ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించడంతో పాటు సభ్యులుగా చేరేందుకు కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు కుదించాం..’ అని మంత్రి చెప్పారు. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ను సవరించాలని నిర్ణయించాం. తెలంగాణ పర్యాటక పాలసీ–2025ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. పర్యాటక విధానంతో వచ్చే 5 ఏళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నాం..’ అని పొంగులేటి తెలిపారు. మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు.. ‘మేలో జరగనున్న మిస్ వరల్డ్– 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. 140 దేశాల నుంచి హాజరుకానున్న అతిథులకు ఎక్కడా లోటు జరకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం..’ అని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. తాజాగా మళ్లీ వారిలో యోగ్యులను జీపీఓలుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో కేంద్రం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. పారా ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 361 పోస్టులను మంత్రివర్గం మంజూరుచేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 అవుట్ సోర్సింగ్ పోస్టులు కలిపి మొత్తం 495 పోస్టులను ఆమోదించింది. దక్షిణాదికి అన్యాయంపై త్వరలో అఖిలపక్ష భేటీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. కేంద్రంతో కొట్లాడి ఉత్తరాది రాష్ట్రాలకు సమానంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తెచ్చుకోవడానికి త్వరలో హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పోరాడాలని నిర్ణయించామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందం – అందుకే ‘పట్టభద్రుల’ అభ్యర్థి ఓటమి – మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారీ ఒప్పందంతో వెళ్లినందునే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యాడనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనితో పాటు ఎన్నికలు ఎదుర్కొన్న తీరులో ఎక్కడైనా లోపాలుంటే భవిష్యత్తులో సవరించుకోవాల్సి ఉంటుందని కొందరు సూచించినట్లు తెలిసింది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా మంత్రులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలురాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2025–26ను సభలో ప్రవేశపెట్టనుంది. -
వెన్ను విరిచిన బాబు.. దన్నుగా జగన్
సాక్షి, అమరావతి: బీసీలకు వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబునాయుడు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కుతంత్రాలు పన్నిందే చంద్రబాబు. ఈ అంశంపై టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా ఆయన పురిగొల్పారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసినా, 2014– 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల సమయంలో ఏ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించలేకపోయారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95 శాతం రిజర్వేషన్లతో అన్ని రకాల స్థానిక సంస్థలకు ఎన్నిక లు నిర్వహిస్తే టీడీపీ కోర్టుకు వెళ్లి మరీ బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించింది. ఫలితంగా జిల్లా పరిషత్ చైర్మన్, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సహా ఏకంగా దాదాపు 15 వేలకు పైగా పదవులు కోల్పోవాల్సి వచ్చింది. టీడీపీ నేత కోర్టు కేసుతో జీవోపై స్టే.. మొత్తం రిజర్వేషన్లను తగ్గిస్తూ తీర్పు! ♦ బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కల్పిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కోట్టివేసింది. ♦ ఆ తర్వాత సైతం సుప్రీంకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తే పత్రాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. పర్య వసానంగా...ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లను మా ర్పులు చేయకూడదు. దీంతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు నష్టపోవాల్సి వచ్చింది. దగా చేసింది బాబు...ఆదుకుంది జగన్... పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు అమలుకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో 2019 డిసెంబరులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పను ల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ చేసేలా ఏకంగా చట్టాన్ని తీసుకువచ్చారు. మోసాలు బాబు నైజం...బీసీలకు పట్టమే జగనిజం... చంద్రబాబు చేసిన మోసాలు, మాయలను పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్ మేలు చేశారు. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో బీసీలకు 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటా యించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. 14 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ క్లీ న్ స్వీప్ చేస్తే.. అందులో తొమ్మిది చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే 44 స్థానాలు బీసీలకే ఇచ్చారు.రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు. నాడు అవమానం.. నేడు సమున్నత గౌరవం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఇప్పుడు 25 మంది సభ్యులు ఉంటే అందులో ఏకంగా 11 మంది బీసీలకు ఆయన స్థానం కల్పించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలను ఆ వర్గాలకు అప్పగించారు. చంద్రబాబు 2014–19 మధ్య మంత్రివర్గంలో కేవ లం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. టీడీపీ హ యాంలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు 29 పదవులు జగన్ ఇస్తే.. 2014–19 మధ్య చంద్రబాబు18 పదవులు మాత్రమే ఇచ్చారు. -
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి
-
బీసీల రిజర్వేషన్లు మింగేసిన టీడీపీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన దాదాపు పది శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ గండికొట్టింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా కూడా 2014–19 మధ్య చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారు. కానీ, టీడీపీ నేత కోర్టుకెళ్లి బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించారు. దీంతో.. జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సహా దాదాపు 15 వేలకు పైగా పదవులను ఆ వర్గాలు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి.. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు ఏ మాత్రం రిజర్వేషన్లు తగ్గించకుండా.. అదే సమయంలో ఎస్సీ, జనరల్ కేటగిరి రిజర్వేషన్లు పెరిగేలా.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు 2019 డిసెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో జీఓ.. ► రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీలో ఎస్టీల జనాభా తగ్గిపోయి, ఎస్సీల జనాభా పెరిగిపోవడంతో నిబంధనల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీల రిజర్వేషన్లు 34 శాతం కొనసాగిస్తూ.. ఎస్టీలకు తగ్గిపోయిన రిజర్వేషన్ల స్థానంలో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం నుంచి 19.08 శాతానికి.. జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా 2013లో అమలుచేసిన 39.44 శాతం రిజర్వేషన్లు 40.15 శాతానికి పెరిగాయి. ► ఈ మేరకు జగన్ ప్రభుత్వం 2019 డిసెంబరు 28న జీఓ–176 జారీచేసింది. ► పంచాయతీరాజ్ శాఖాధికారులు కూడా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవుల్లో బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషను ఖరారుచేసి 2020 జనవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆ జీవోపై ‘సుప్రీం’లో టీడీపీ కేసు అయితే, జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హయాంలో రెండుసార్లు నామినేటెడ్ పదవిని అనుభవించిన కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సంఘం (ఇది ప్రైవేట్ సంఘం) ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌తో.. కోర్టు 176 జీవోను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రతాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. నిజానికి.. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లకు మార్పులు చేయకూడదు. ఈ ఆదేశాలతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, చంద్రబాబు ఈ తీర్పుతో కొత్త నాటకానికి తెరతీశారు. రిజర్వేషన్లను తగ్గించడానికి వీల్లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బాబే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి వేసిన కేసులో ‘సుప్రీం’ తీర్పు రిజర్వేషన్లపై ఎప్పుడేం జరిగిందంటే.. 2019 డిసెంబరు 28 : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ ప్రభుత్వం జీఓ 176 జారీ. 2020 జనవరి 8: ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు. 2020 జనవరి 10: స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి 2020 జనవరి 15: 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం. 2020 మార్చి 2 : సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత వేసిన కేసుపై స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. -
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు!
సాక్షి, అమరావతి: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అలుపులేని పోరాటం చేస్తోందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యసభలో తాము ఇప్పటికే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. బీసీల హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడే బాధ్యతను వైఎస్సార్సీపీ తీసుకుందన్నారు. బీసీ సామాజిక వర్గాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి వారి ప్రయోజనాలను కాపాడే వైఎస్సార్ సీపీని 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చి వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ బీసీ ఆతీ్మయ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సదస్సులు బీసీ సామాజిక వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే బీసీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా 225 మంది బీసీ ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశాన్ని కోర్ కమిటీ భేటీగా పరిగణిస్తున్నాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బీసీ నాయకులందరిని కూడగట్టి పది రోజుల్లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తాం. అనంతరం 26 జిల్లాల్లో బీసీసదస్సులు జరుగుతాయి. నేరుగా రూ.2 లక్షల కోట్లు.. టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీల కోసం రూ.19,369 కోట్లు ఖర్చు చేయగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో నేరుగా నగదు బదిలీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల దాకా.. సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు కేటాయించగా 243 బీసీలకే దక్కాయి. బీసీలకు 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే అందులో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. సచివాలయాల్లో 2.7 లక్షల వలంటీర్ ఉద్యోగాలతో పాటు మిగతావి కూడా కలిపి 6.03 లక్షల ఉద్యోగాలను సృష్టించగా 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకే ఇచ్చాం. రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి మొత్తం 2,61,571 ఉద్యోగాలను బీసీలకే ఇచ్చాం. మహిళా సాధికారత.. మంత్రిమండలిలో 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సీఎం జగన్ చోటు కల్పించారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పించారు. డిప్యూటీ సీఎం పదవులు ఐదుగురికి ఇస్తే 80% బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకే దక్కాయి. స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్, పదవుల్లో బీసీలు, ఎస్సీలకే అవకాశం కల్పించాం. మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళను నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను సీఎం జగన్ కల్పించారు. ఇదే రీతిలో చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని అధ్యక్షతన జరిగిన ప్రతి అఖిలపక్ష సమావేశంలోనూ వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేశాం. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాం. బాబు దృష్టిలో బానిస క్లాస్... బీసీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బానిస క్లాస్‌గా పరిగణిస్తారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయానికి వస్తే తోకలు కత్తిరిస్తానని బెదిరించి అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా ఉండటానికి వీల్లేదంటూ 2017 మార్చి 21న కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబే. -
కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, హైదరాబాద్: బీసీ జనాభాను లెక్కించి, చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే పంచా యతీ ఎన్నికలు నిర్వహించాలన్న తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా, ఈ వ్యవహారంలో ఇప్ప టి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. జూన్ 14లోపు కౌంటర్ దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షం లో ఈ కేసులో విచారణ కొనసాగించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేశారు. బీసీ జనాభా లెక్క లు తేల్చి, ఆ లెక్కల ప్రకారం రిజర్వే షన్లు ఖరారు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని గతేడాది ప్రభుత్వా న్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీసీ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వంగా రామచంద్ర గౌడ్, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. వాదన లు విన్న న్యాయమూర్తి.. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావును నిలదీశారు. తదుపరి విచారణకల్లా కౌంటర్ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేశారు. -
‘పంచాయతీ’ ఆపలేం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతంగా ఖరారు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 15న తీసుకొచ్చి న ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ మహాజన సమితి ప్రతినిధి యు. సాంబశివరావు (ఉసా), తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిమండలి లేకుండా ఆర్డినెన్స్ జారీ చేయడం చెల్లదని, అందువల్ల దీన్ని రద్దు చేయాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామల రవీందర్ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు ఉసా, జాజుల తరఫున సీనియర్ న్యాయవాది కె.జి. కృష్ణమూర్తి వాదిస్తూ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించి బీసీ జనాభాను, ఓటర్లను తేల్చలేదని, ఆర్థిక, గణాంక డైరెక్టరేట్ ఇచ్చిన గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందన్నారు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 243 (డీ) కింద రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డంకులేవీ లేవన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని వ్యాఖ్యానించింది. తరువాత కృష్ణమూర్తి వాదనలు కొనసాగిస్తూ గతంలో పంచాయతీరాజ్ చట్టం కింద బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవని, ఇప్పుడు చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారా వాటిని కుదించారన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించరాదని ప్రభుత్వం వాదిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆర్డినెన్స్ తెచ్చిందని వివరించారు. నిమ్మక జయరాజ్ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న నిబంధనను సుప్రీంకోర్టు పక్కనపెట్టిందని, దీని ఆధారంగానే బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆయన గుర్తుచేశారు. లెక్కలు సేకరించాం... అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఆర్డినెన్స్ తెచ్చామని ధర్మాసనానికి వివరించారు. ఈ సమయంలో కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ బీసీ జనాభా, బీసీ ఓటర్ల లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఆ లెక్కలు తేల్చలేదని, అందుకే దానిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ వల్ల బీసీ రిజర్వేషన్లు 22 శాతానికే పరిమితం అవుతున్నాయన్నారు. దీనిపై ఏఏజీ స్పందిస్తూ నిబంధనల మేరకు బీసీ లెక్కలు సేకరించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా రూపొందించామన్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ అయిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయినందున పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆర్డినెన్స్ చట్టబద్ధతపై మాత్రం తేలుస్తామని స్పష్టం చేసింది. -
పంచాయతీ ఎన్నికలు ఆపలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22కి తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని పిటిషన్లో కృష్ణయ్య కోరారు. -
బీసీలను ప్రభుత్వం మోసగించింది: జాజుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేసిందని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల అత్యవసర సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తు న నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప బోమని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టి రిజ ర్వేషన్లు దక్కించుకుంటామని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేం ద్రను ఏకపక్షంగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారన్నారు. రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని జస్టిస్ ఈశ్వరయ్య ప్రశ్నించారు. బీసీలకు మొదటి నుంచీ టీఆర్ఎస్ వ్యతిరేకమేనని ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి దాన్ని రుజువు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీల ఉసురు తగులుతుందని బీసీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు వీజీఆర్ నారగోని, పి.రామకృష్ణయ్య అన్నారు. -
దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్‌లో తప్పులున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ ఎలా తగ్గించారో చెప్పాలంటూ 2018 జూన్‌లో సీఎం కు లేఖ రాశామని, స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని స్పష్టం చేశారు. పిటిషన్లో ఎక్కడా కూడా ఎన్నికలు ఆపమని కోరలేదని, ఎన్నికలు ఆపాలని కుట్ర చేసింది టీఆర్ఎస్సే అని దుయ్యబట్టారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పిటిషన్ వేసి ఎన్నికలు ఆపిందని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు. తాను ఎన్నికలు ఆపమని కోరి నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను ఇడియట్స్ అంటూ కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించా రు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని అహంకారంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పు ఇచ్చినా కుల గణన చేయకుండా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి పిటిషన్ వేస్తే 50 శాతం రిజర్వేషన్ ఇవ్వొద్దని కోర్టు చెప్పిందని శ్రవణ్ అన్నారు. అతన్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కేటగిరి చేసి రిజర్వేషన్ అమలు చేయాలని టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ వేయలేదా అని ప్రశ్నించారు. అది తప్పు కానప్పుడు తాము కోరితే తప్పు ఎలా అవుతుందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్‌కు బీసీగణన చేయడం పెద్ద సమస్య కాదని, చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. కర్ణాటకలో మాదిరిగా బీసీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. -
బీసీల వినతులను సీఎం తిరస్కరించారు: జాజుల
హైదరాబాద్: పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు అఖిలపక్ష పార్టీలు, న్యాయనిపుణులు, బీసీ సంఘాల నేతలు వినతి పత్రాలను సమర్పిస్తే వాటిని పెడచెవిన పెట్టి ఫెడ రల్ ఫ్రంట్ అంటూ విమానం ఎక్కారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీసీల వినతులను సీఎం తిరస్కరించారని ఆరోపించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 26న అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, న్యాయ నిపుణులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న 31 జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో లక్ష మందితో హైదరాబాద్‌లో ఆత్మగౌరవసభ నిర్వహిస్తామని, అప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి రెండో వారంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య గౌడ్, తాటికొండ విక్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల తగ్గింపు చరిత్రాత్మక తప్పిదం.. బీసీల రిజర్వేషన్లను 34 శా తం నుంచి 23 శాతానికి తగ్గించడం ప్రభుత్వం చేస్తు న్న చరిత్రాత్మక తప్పిదం అని జాజుల విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్ కమిటీ, ఎంబీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జాజుల మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చే గిఫ్ట్‌ను సీఎం కేసీఆర్ బీసీలకు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదేనన్నారు. బీసీల రిజర్వేషన్లకు గండికొడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫె సర్ కె.మురళీమనోహర్, ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి గ్రేటర్ నేత కిల్లే గోపాల్, ఎంబీసీ సంఘం నేత ప్రొ. సుదర్శన్‌రావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
బీసీలను పాలనకు దూరం చేసే కుట్ర: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వారిని పాలనకు దూరం చేసే కుట్ర అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రామపంచాయతీల్లో 50 శాతానికన్నా ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేయాలంటే తగిన ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ తీర్పును తప్పుగా ప్రచారం చేసి ప్రభుత్వం దుర్మార్గపు విధానాలకు పాల్పడుతోందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. -
కులాల గణన తర్వాతే రిజర్వేషన్ అమలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాల గణన తర్వాతే రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శిలకు లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించి దాని ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 52% బీసీలు ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 22 లక్షల ఓట్లను తొలగించి క్షమాపణ చెప్పిన ఎన్నికల సంఘం జాబితా ఆధారంగా కులగణన చేపడితే సహించబోమన్నారు. బీసీఉపకులాల వెనుకబాటుతనం ఆధారంగానే కులగణన చేపట్టాలని గతంలో ప్రభుత్వాన్ని కోరితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతోనే తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారమే కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి శాస్త్రీయ విధానం ద్వారా బీసీకులాల గణన జరగాలని కోరారు. ఆదేశాలు బేఖాతర్ సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేయడం లేదని, హైకోర్టు ఉత్తర్వులను కేసీఆర్ ప్రభుత్వం బేఖాతర్ చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు. హైకోర్టు తీర్పు గత జూన్ నెలలోనే ఇచ్చినప్పటికీ బీసీకులాల వెనుకబాటుతనానికి కారణాలు కనుక్కోకుండా ముందస్తు ఎన్నికల హడావుడిలో మునిగిపోయిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీకులాలగణనను తూతూ మంత్రంగా చేపడుతున్నారని ఆరోపించారు. రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ బీసీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. -
పోరాడితేనే రాజ్యాధికారం
నిజామాబాద్ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆయన చేపట్టిన బీసీ రాజకీయ చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. బీసీలంతా ఐకమత్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని, అందులో 30 సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
తీర్మానాలు ఆమోదించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సమావేశంలో బీసీల సమస్యలపై చర్చించి తయారు చేసిన 210 డిమాండ్ల ముసాయిదా తీర్మానాలను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ఈ బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లు కేటాయించాలని, రూ. 20 వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక ఏర్పాటు చేయాలని కోరారు. ఈనెల 10న హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్ హాల్లో బీసీ నాయ్యవాదుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుజ్జకృష్ణ, సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నీల వెంకటేశ్, నర్సింహాగౌడ్, రాజేందర్, భూపేస్సాగర్ పాల్గొన్నారు. -
చట్ట సభల్లో బీసీ కోటా
-
‘మంజునాథ’ నివేదిక రాగానే కేంద్రానికి
టీడీపీ కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన మంజునాథ కమిషన్ నివేదిక అందగానే మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో జరిగింది. పార్టీ కాపు నాయకులు పాల్గొన్న సభకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి మంజునాథ కమిషన్ నివేదిక అందుతుందని చెప్పారు. అయితే ఈ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఆయన సమావేశానికి రానట్లు తెలుస్తోంది. రీజినల్ హబ్‌గా తిరుపతి తిరుపతి: తిరుపతిని రీజినల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన తిరుపతి పర్యటనలో భాగంగా మొదటిరోజు పలు నూతన భవనాలను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరుపతి, వైజాగ్, రాజధాని ప్రాంతాన్ని ప్రాంతీయ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తిరుపతిలో అవినీతి నిరోధకశాఖ ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చిన 1100 కాల్ సెంటర్‌ను అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. -
బీసీ సబ్–ప్లాన్‌పై పోరాటం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచా లని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ అమలు కోసం క్షేత్రస్థాయి పోరాటాలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. గాంధీభవన్‌లో ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్‌దాస్ అధ్యక్షతన గురు వారం బీసీల సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్న సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు టీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేయాలన్నారు. బీసీలు అందరిని ఒక్కతాటిపైకి తేవాలని పిలుపుని చ్చారు. సెప్టెంబరు 30 నాటికి గ్రామాల్లో కమిటీలు నియమించి, సభ ఏర్పాటుచే యాలన్నారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌లోనే సాధ్యమని, 3 నెలల్లో గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చేయాలని విక్రమార్క సూచించారు. పార్టీ నాయకులు మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, నెరేళ్ల శారద, సురేశ్ షెట్కార్తో పాటు జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై కేసీఆర్ నిర్ణయం సంతోషకరం
ఏపీలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉంది: ముద్రగడ కిర్లంపూడి(జగ్గంపేట): చంద్రబాబు పాదయాత్రలోను, ఎన్నికల మేనిఫెస్టోలోను కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని తక్షణమే అమలు చేయాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర అలాంటి నిర్ణయం పొందకపోవడం తమ జాతి చేసుకున్న పాపమని భావిస్తున్నానని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉందన్నారు. మే 7న కాకినాడలో 13 జిల్లాల కాపు పెద్దలతో సమావేశమై ఉద్యమం ఉధృతానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. -
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి
హైదరాబాద్: రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచాలని టీడీపీ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు ముస్లిం రిజర్వేషన్లు పెంచుతున్న ప్రభుత్వం.. బీసీల రిజర్వేషన్లు కూడా 52 శాతానికి పెంచాలన్నారు. ఎస్టీ జనాభా ప్రకారం వారి రిజర్వేషన్లు పెంచినప్పుడు బీసీల కోటా ఎందుకు పెంచరని ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు ఆయన లేఖ రాశారు. గతంలో బీసీ రిజర్వేషన్లు హెచ్చించినప్పటికీ జనాభా లెక్కలు లేని కారణంగా కోర్టు కొట్టేసిందని, తాజాగా 2011 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నందున ఆమేరకు పెంచాలన్నారు. అదేవిధంగా స్ధానిక సంస్థల్లోనూ బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంచితేనే బీసీలు అభివృద్ధి చెందుతారని కృష్ణయ్య లేఖలో పేర్కొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య కోరారు. గురువారం స్థానిక బీసీ భవన్లో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలని వారు డిమాండ్ చేశారు. కాపులు, బీసీల మధ్య తగవు పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. బీసీ జేఏసీ నాయకులు హేమంత్‌గౌడ్, బీసీ అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు జలం శ్రీను, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బత్తుల అశోక్‌రాజ్, ప్రధాన కార్యదర్శి బోయ అశోక్, నాయకులు మద్దయ్య, వెంకట్రాముడు పాల్గొన్నారు. -
'బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి'
- మోదీ వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి - తెలుగు రాష్ట్రాల సీఎంలను డిమాండ్ చేసిన ఆర్.కృష్ణయ్య జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పుడే తగిన న్యాయం చేకూరుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మెదక్ జిల్లా జహీరాబాద్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నా దేశంలోని 70కోట్ల మంది బీసీలకు తగిన ఫలాలు దక్కలేదన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తప్ప ఇతర రంగాల్లో కోటా దక్కడం లేదన్నారు. బీసీలకు సరైన వాటా కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని అఖిలపక్షం, బీసీ సంఘాలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలకు ఏ రంగంలో కూడా తగిన న్యాయం జరగడం లేదన్నారు. రాజకీయ రంగంలో కేవలం 12 శాతం మంది ఉన్నారన్నారు. ఉద్యోగ రంగంలో 9 శాతమే దక్కిందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్నట్లుగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను అత్యంత వెనుకబడిన కులాల వారిని నామినేట్ చేయాలని కోరారు. 90 శాతం కులాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీని ప్రకటించాలని, 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. 12 బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నా బీసీలకు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు బీరయ్య యాదవ్, జి.గుండప్ప, ఎంజీ రాములు, జి.భాస్కర్, శ్రీనివాస్ ఖన్న, సుభాష్, విశ్వనాథ్ యాదవ్, రమేష్ బాబు, సుధీర్ భండారీ పాల్గొన్నారు. -
‘కాపు’లపై శ్వేతపత్రం విడుదల చేయూలి
బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు తెనాలి టౌన్ : కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలకు నష్టం జరగదని టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని ఎన్జీవో కల్యాణ మండపంలో బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన సాంబశివరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం జిల్లాలవారీగా సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర రాజధానిలోని బీసీ ఐక్య గర్జనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు యూవీ చక్రవర్తి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం 54 శాతం ఉన్న బీసీలందరూ ఏకకులంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోలా శంకర్, నాయకులు టి.ఆశోక్‌యాదవ్, కందుల సాంబశివరావు గౌడ్, పి.సుఖదేవయ్య, జి.అమేశ్వరరావు, జయలత, వేల్పూరి వెంకటేశ్వర్లు, గండికోట నరసింహారావు, వివిధ వర్గాలకు చెందిన బీసీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది ఉండదు
బీసీ రుణమేళా సభలో మంత్రి కొల్లు రవీంద్ర బాబు భరోసా ఇచ్చారని వెల్లడి సీఎం జ్యోతి ప్రజ్వలనతో రుణమేళా ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో : ఎవరెన్ని చేసినా బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపాడతానని సీఎం భరోసా ఇచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో సీఎం చంద్రబాబు రుణ మేళా ప్రారంభించారు. రుణ మేళాలో ఆటోలు, వీడియో కెమెరాలు, సెంట్రింగ్ యూనిట్, ఎయిర్ కంప్రెషర్, ఆయిల్ ఇంజిన్, కలంకారీ కిట్లు, పడ వలలు, చేపల వలలు, ఇస్త్రీ పెట్టెలు, బార్బర్ కుర్చీలు, మినీ ట్రాక్టర్లు, వడ్రంగి పనిముట్లు, కుండలు చేసే వస్తువులు, వెదురు కళాత్మక వస్తువుల తయారీ యూనిట్లు, జనరిక్ ఔషధాల పంపిణీకి సహాయం వంటి వాటికి రుణాలు అందించారు. సభకు మందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బీసీలు చంద్రబాబు నాయకత్వాన్ని వదలరన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బీసీలకు టీడీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుం దని అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.రంగనాయకులు మాట్లాడుతూ బీసీ కులాలను ఆదుకునేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొచ్చులు అర్జునుడు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, నాగుల్‌మీరా మాట్లాడారు. సభలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కొనేరు శ్రీధర్, ఎమ్మెల్యే శ్రీరాం తాతాయ్య, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, ఎ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, మహిళా కార్పొరేషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, బీసీ కార్పొరేషన్ డెరైక్టర్లు ఎల్ఎల్ నాయుడు పాల్గొన్నారు. -
కాపులకు స్వేచ్ఛ లేదా?
చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ టీడీపీ నాయకులు తరచుగా సభలు, సమావేశాల్లో ప్రకటిస్తున్నారని, అరుుతే ఇలాంటి కొంగజపాలు మాని ఎన్నికల హామీలను అమల్లో పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. హామీల అమలు గురించి అడిగిన వారిపై దాడులు చేయించడాన్ని తప్పుపట్టారు. ‘ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? లేక ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విధించారా?’ అని ప్రశ్నిస్తూ సీఎంకు రాసిన లేఖ ప్రతులను శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘ఈ రాష్ట్రంలో కాపులు మీటింగ్‌లు పెట్టుకోకూడదా? ఏ ఊరిలో చూసినా మీ ముఖంతో ఉన్న ఫ్లెక్సీలే ఉండాలా? మీ ఫ్లెక్సీలపై మా జాతి దాడి చేయడానికి సంస్కారం అడ్డువస్తోంది. మీరు పాదయాత్రలో, 2014 ఎన్నికల సమయంలో బలిజ, ఒంటరి, తెలగ, కాపు జాతి ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, సంవత్సరానికి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. వాటి గురించి అడుతుంటే దాడులు చేయిస్తున్నారు. మీరిచ్చిన హామీల గురించి రోడ్డుపైకి వచ్చి అడగకూడదా? పట్టిసీమకు, పప్పుబెల్లాలకు, రాజధాని వంకతో యువరాజా వారి పట్టాభిషేకం కోసం, మీరు విదేశాల్లో తిరగడానికి కోట్ల ప్రజాధనాన్ని అడ్డూ అదుపు లేకుండా ఖర్చు చేయట్లేదా? కాపు జాతికి ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బిచ్చం వేసినట్లుగా రూ.50 కోట్లు, రూ.100 కోట్లు ఇచ్చి సరిపెడతారా? ఎందుకు మా జాతిని చులకనగా చూస్తున్నారు? మీరు గద్దె ఎక్కడానికి మాత్రం మా జాతి ఓట్లు కావాలా? మీరిచ్చిన హామీలే అమలు చేయమంటే అబద్ధాలతో ఎదురుదాడి చేయించడం సమంజసమా? మా మీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో! బంతిని ఎంతగట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. మా జాతి తిరగబడటానికి భయపడదు. మీ తీరు మార్చుకోండి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం...’ అని లేఖలో పేర్కొన్నారు. -
బీసీ ఎంపీలూ.. నోరు విప్పండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :ప్రస్తుత లోక్‌సభలో 115 మంది, రాజ్యసభలో 32 మంది ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ కోసం నోరు విప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మోరంపూడి కల్యాణ మండపంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం నగర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంపీలు బీసీల తరఫున నోరు విప్పకపోతే ప్రజల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. రూ.50 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు 34 నుంచి 50 శాతానికి రిజర్వేషన్లు పెంచి రాజ్యాంగ బద్ధత కల్పించాలని కోరారు. బీసీ కులానికి చెందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారని, రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించడానికి ఇదే సరైన తరుణమన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు లాంటి డిమాండ్ల సాధనకు పార్లమెంట్‌ను స్తంభింపచేయాలన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధనకు పోరాటాలు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అధ్యక్షునిగా మారగాని చంద్రకిరణ్, ప్రధాన కార్యదర్శిగా వేగి చిన ప్రసాద్, మహిళా అధ్యక్షురాలుగా గుత్తుల బాలా త్రిపుర సుందరిలతో కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నౌడు వెంకట రమణ, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా నాయకురాలు సరళాదేవి, చనుమోలు అశోక్ గౌడ్, నగర కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ ముజుబూర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నగర శాఖ నూతన అధ్యక్షుడు చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సభావేదికకు చేరుకున్నారు. -
బీసీ రిజర్వేషన్ కల్పించకుంటే ఉద్యమిస్తాం
తెలగ, బలిజ, కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 30 మేరకు కాపులను వెంటనే బీసీ జాబితాలో చేర్చి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీబీకే (తెలగ, బలిజ, కాపు) జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము డిమాండ్ చేశారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మంది రంలో బుధవారం తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర స్థాయి 4వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ టీడీపీ గత ప్రభుత్వాల్లాగా కాపులను వాడుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యం: అంబటి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపుల బీసీ రిజర్వేషన్ జీవో ఎడారిలో ఒయాసిస్ లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పారు. కాపులకు రెండు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, రెండవ వాగ్దానమైన బీసీ రిజర్వేషన్ కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో మాట్లాడి కాపుల బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలియ చేస్తామన్నారు. మాజీ మంత్రి శాసన మండలిలో విపక్షనేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ కాపు కుల సంఘాలు ఎక్కువయ్యాయని అనేక మంది తమ స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటున్నారని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా ఉద్యమాలు నిర్వహించిన టీబీకే-జేఏసీని వ్యవస్థాపక సంఘంగా స్థాపించి కార్యవర్గాన్ని నియమించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జీడీఎం ఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీఎల్వీ ప్రసాదరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్.ఎల్.వి.నారాయణ, తులసీ గ్రూప్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు, వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'కాపుల బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి'
హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాపు సంఘం నేతలు కలిశారు. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాపు వర్గాలన్నీ కాంగ్రెస్ కు దూరమవుతాయన్నారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిన విషయాన్ని బొత్స కూడా అంగీకరించారు. అందుకు కాపు సంఘం నేతలకు బొత్స క్షమాపణలు తెలిపారు.ఈ నెల 10 లోగా సీఎం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామి ఇచ్చారు. -
త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకానుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శని వారం బీసీ జనదిశ సదస్సు ప్రొఫెసర్ మురళీమనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి సారయ్య, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహా త్మా జ్యోతిరావుపూలే పేరుతో బీసీ మేనిఫెస్టో కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం కేంద్రానికి నోట్ తయారు చేసి పంపించామని వివరించారు. ముఖ్యమంత్రి సైతం బీసీ సబ్‌ప్లాన్‌పై చొరవ చూపారని, త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ సబ్‌ప్లాన్ అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. అధికశాతం శ్రమజీవులు, నాగరికత తెలిసినవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు బీసీలేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పార్టీలకతీతంగా అందరం ఒకటి కావాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడారు. రాష్ట్రంలో 80 శాతం, దేశంలో 56 శాతం జనాభాలో బీసీలే ఉన్నారని వెల్లడించారు. బీసీలను ఏకం చేయడం కోసం త్వరలోనే జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. ప్రొఫెసర్లు రవీందర్, దామోదర్, మనోహర్‌రావు, టి.రమేష్, బీసీ నాయకులు గుండు ప్రభాకర్, బయ్య స్వామి, మీసాల ప్రకాష్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు దిడ్డి కుమారస్వామి, సాదుల దామోదర్, కటకం పెంటయ్య, చాంబర్ మాజీ అధ్యక్షుడు కంభంపాటి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మందా వినోద్‌కుమార్, గోరంటల రాజు, వేముల నాగరాజు, బస్వరాజు శ్రీమాన్, బస్వరాజు కుమార్, వస్కుల ఉదయ్‌కుమార్, కొమ్ము సుధాకర్, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిరాశతో వెనుదిరిగిన ఉద్యోగ జేఏసీ నాయకులు.. కేంద్ర సామాజిక సహాయ మంత్రి బలరాం నాయక్‌ను సన్మానించడం కోసం జిల్లా ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, నగర అధ్యక్షుడు గజ్జెల రామకృష్ణ తదితరులు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి విచ్చేశారు. కాగా ఈ లోపే మంత్రి బలరాంనాయక్ వేరే పనిమీద బయటకు వెళ్లడంతో ఉద్యోగులంతా నిరాశకు గురయ్యారు.