పోరాడితేనే రాజ్యాధికారం

Jajula Srinivas Goud Meeting On BC Reservation - Sakshi

బీసీలకు 56 శాతం సీట్లు కేటాయించాల్సిందే: జాజుల

నిజామాబాద్‌ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆయన చేపట్టిన బీసీ రాజకీయ చైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. బీసీలంతా ఐకమత్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 60 మంది అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని, అందులో 30 సీట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top