కౌంటర్‌ దాఖలు చేయరా? 

 High Court has ordered the Government to file a Counter Through 14 - Sakshi

బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో హైకోర్టు 

ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: బీసీ జనాభాను లెక్కించి, చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే పంచా యతీ ఎన్నికలు నిర్వహించాలన్న తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా, ఈ వ్యవహారంలో ఇప్ప టి వరకు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. జూన్‌ 14లోపు కౌంటర్‌ దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షం లో ఈ కేసులో విచారణ కొనసాగించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్‌ 14కి వాయిదా వేశారు.

బీసీ జనాభా లెక్క లు తేల్చి, ఆ లెక్కల ప్రకారం రిజర్వే షన్లు ఖరారు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని గతేడాది ప్రభుత్వా న్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీసీ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రామచంద్రరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వంగా రామచంద్ర గౌడ్, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. వాదన లు విన్న న్యాయమూర్తి.. కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్‌ దాఖలు చేయకపోవడం ఏమిటని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావును నిలదీశారు. తదుపరి విచారణకల్లా కౌంటర్‌ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top