
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలు డిసైడ్ చేస్తే బిల్లు పాస్ అవుతుందన్నారు. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈరోజు(ఆదివారం, ఆగస్టు 31వ తేదీ) జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘ బీసీ రిజర్వేషన్లపై సీఎం నాలుగుసార్లు మాట మార్చారు. మార్చి నాటి బిల్లుకు, ఈ బిల్లుకు తేడా ఏంటో చెప్పాలి.
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్‌లో ఉంది. 52సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ ఏం చేశారు. సీఎం రేవంత్ ఎందుకు ప్రధాని మోదీని కలవలేదు. ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేయాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.