18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు | Brs Support Bc Unions Bandh On October 18 | Sakshi
Sakshi News home page

18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు

Oct 15 2025 3:56 PM | Updated on Oct 15 2025 7:23 PM

Brs Support Bc Unions Bandh On October 18

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ ఆ సంఘాల నేతలు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ  దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు.

‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది.

..పార్లమెంటులో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఈనెల 18న బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement