
న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వ మంత్రుల బృందం. దీనిలో ఈరోఉ(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు.. కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై అభిషేక్ సింగ్వితో తెలంగాణ మంత్రుల బృందం చర్చలు జరిపింది. న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి సలహాలు తీసుకున్నాం. ఈ అంశంపై అధ్యయనం జరిపి ఆయన సలహాలు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత క్యాబినెట్‌కు మా నివేదిక అందజేస్తాం’ అని తెలిపారు.