రిజర్వేషన్లపై కేసీఆర్‌ నిర్ణయం సంతోషకరం | CM KCR Decision on BC reservation | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై కేసీఆర్‌ నిర్ణయం సంతోషకరం

Apr 14 2017 1:51 AM | Updated on Aug 14 2018 11:02 AM

రిజర్వేషన్లపై కేసీఆర్‌ నిర్ణయం సంతోషకరం - Sakshi

రిజర్వేషన్లపై కేసీఆర్‌ నిర్ణయం సంతోషకరం

చంద్రబాబు పాదయాత్రలోను, ఎన్నికల మేనిఫెస్టోలోను కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని తక్షణమే అమలు చేయాలని మాజీ ఎంపీ,

ఏపీలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉంది: ముద్రగడ
కిర్లంపూడి(జగ్గంపేట): చంద్రబాబు పాదయాత్రలోను, ఎన్నికల మేనిఫెస్టోలోను కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని తక్షణమే అమలు చేయాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ  సీఎం చంద్రబాబు దగ్గర అలాంటి నిర్ణయం పొందకపోవడం తమ జాతి చేసుకున్న పాపమని భావిస్తున్నానని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాపులుగా ఎందుకు పుట్టామా అని బాధగా ఉందన్నారు. మే 7న కాకినాడలో 13 జిల్లాల కాపు పెద్దలతో సమావేశమై ఉద్యమం ఉధృతానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement