
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? కాదా? అన్న ఉత్కంఠతకు తెరపడింది. గురువారం (అక్టోబర్9) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రేపు ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు
అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లు
అక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు
అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్
అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్