పంచాయతీ ఎన్నికలు ఆపలేం: హైకోర్టు | High Court Nod for Telangana Panchayat Elections | Sakshi
Sakshi News home page

Jan 3 2019 2:00 PM | Updated on Jan 3 2019 4:19 PM

High Court Nod for Telangana Panchayat Elections - Sakshi

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ నిలిపివేతకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22కి తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కృష్ణయ్య కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement