బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి | BC reservation should be released White Paper | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Oct 28 2016 2:19 AM | Updated on Sep 4 2017 6:29 PM

రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య కోరారు.

కర్నూలు(అర్బన్‌): రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య కోరారు. గురువారం స్థానిక బీసీ భవన్‌లో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది.  బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలని వారు డిమాండ్‌ చేశారు. కాపులు, బీసీల మధ్య తగవు పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. బీసీ జేఏసీ నాయకులు హేమంత్‌గౌడ్, బీసీ అభివృద్ధి బోర్డు అధ్యక్షుడు జలం శ్రీను, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బత్తుల అశోక్‌రాజ్, ప్రధాన కార్యదర్శి బోయ అశోక్, నాయకులు మద్దయ్య, వెంకట్రాముడు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement