సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున కర్నూలు శివారు రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కె.కావేరి ట్రావెల్స్ బస్సు.. డివైడర్‌ను ఢీకొట్టింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరగ్గా.. ఈ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు
బస్సు మితిమీరిన వేగంతో రాంగ్ రూట్‌లోకి దూసుకుపోయింది. అదే సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో బస్సులో ప్రయాణీకులను తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.


